Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank fraud: సర్కార్‌ సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. బ్యాంక్‌ మేనేజర్‌ తెలివి చూస్తే.. అవాక్కవాల్సిందే!

ఇంటిదొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్నట్టు దొంగల భయంతో ప్రజలు తమ సంపాదించిన డబ్బును ఇంట్లో పెట్టకుండా.. బ్యాంక్‌లో దాచుకుంటే.. ఆ బ్యాంక్‌లో ఉండే ఉద్యోగులే ప్రజల డబ్బును కాజేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో వెలుగు చూసింది. ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఏకంగా రూ..31.93 కోట్ల ప్రభుత్వ డబ్బును కొట్టేసి వాటిని బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడిగా పెట్టాడు.

Bank fraud: సర్కార్‌ సొమ్ముతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. బ్యాంక్‌ మేనేజర్‌ తెలివి చూస్తే.. అవాక్కవాల్సిందే!
Scam
Anand T
|

Updated on: Jul 07, 2025 | 4:20 PM

Share

ఓ బ్యాంక్‌ మేనేజర్‌ రూ..31.93 కోట్ల ప్రభుత్వ డబ్బును కాజేసి వాటిని విదేశాల్లోని బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడిగా పెట్టిన ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసగా మారి.. రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ ఖాతా నుంచి రూ.31.93 కోట్లను కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. కొట్టేసిన డబ్బును మొత్తం అతను బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడిగా పెట్టినట్టు కనిపెట్టారు.

అయితే ఈ స్కామ్‌లో తన పేరును బయటకు రాకుండా ఉండేందుకు ఆ బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంక్‌ కస్టమర్ల ఆధార్, కేవైసీ వివరాలతో 21 విదేశీ ఖాతాలను ఓపెన్‌ చేశాడు. కొట్టేసిన డబ్బును మొత్తం ఆ ఖాతాల్లోకి బదిలీ చేసి బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడి కోసం ఉపయోగించాడు. అయితే తమ ఖాతాలోని డబ్బు అపహరణ గురించి ఓ ప్రభుత్వాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బ్యాంక్‌ మేనేజర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో సరుదు మేనేజర్‌ను బ్యాంక్‌ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలతో.. పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. సదురు మేనేజర్‌ ఎలా మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడనే వివరాలను పోలీసులుకు అందించింది. దీంతో తాజాగా అతనిపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు.

అయితే ఈ స్కాంక్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఖాతా నుంచి డబ్బును కొట్టేసేందుకు సదరు బ్యాంక్‌ మేనేజర్ చెక్ క్లోనింగ్ విధానాన్ని ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులపై ఉన్న సంతకాలను ఫోర్జరీ చేసి వాటి ద్వారా ప్రభుత్వ డబ్బును తాను తెరిచిన 21 విదేశీ ఖాతాల్లోకి మళ్లించినట్టు గుర్తించారు. రెండేళ్ల పాటు ఇలానే మోసానికి పాల్పడినట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఇలా కొట్టేసిన డబ్బు మొత్తాని అతను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌లో పెట్టుబడిగా పెట్టినట్టు అధికారులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.