ప్రపంచంలోనే తొలిసారి ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్‍కు ఆమోదం.. టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్

కోవిద్ నియంత్రణలో భాగంగా బూస్టర్ డోస్‌గా ఉపయోగించేందుకు ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇన్‍కోవాక్‌కు ఆమోదం లభించింది. ప్రాథమిక సిరీస్, హెటిరోలాగస్ బూస్టర్‌గా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్..

ప్రపంచంలోనే తొలిసారి ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్‍కు ఆమోదం.. టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
Incovacc Intranasal Vaccine
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:47 AM

కోవిద్ నియంత్రణలో భాగంగా బూస్టర్ డోస్‌గా ఉపయోగించేందుకు ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాజిల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇన్‍కోవాక్‌కు ఆమోదం లభించింది. ప్రాథమిక సిరీస్, హెటిరోలాగస్ బూస్టర్‌గా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సివో) నుంచి ఈ నాసికా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించింది. ప్రాథమిక సిరీస్, హెటిరోలాగస్ బూస్టర్‌గా అప్రూవల్స్ పొందిన తొలి ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ ఇదే. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ ఇన్‍కోవాక్ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍ను తయారు చేసింది. వాషింగ్టన్ యూనివర్సిటీ – సెయింట్ లూయిస్‍తో కలిసి భారత్ బయోటెక్ ఈ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍ను అభివృద్ధి చేసింది. ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను ముక్కు ద్వారా ఇస్తారు. బూస్టర్ డోస్‍గా ఇచ్చేందుకు ఇన్‍కోవాక్‍కు ఆమోదం లభించింది. సిడిఎస్‌సివో నుంచి తమ ఇన్‍కోవాక్‌ (బిబివి 154) ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ ఆమోదం పొందిందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుతం బ్లూస్టర్ డోస్‍గా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకే పరిమితి ఉందని తెలిపింది. 18 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ వయసు వారికే ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. హెటిరోలాగస్ బూస్టర్ డోస్‍గా ఈ నాజిల్ వ్యాక్సిన్‍ను ఉపయోగించేందుకు అనుమతి లభించిందని ఆ సంస్థ వెల్లడించింది. అంటే రెండు డోసులు వేరే రకం వ్యాక్సిన్ తీసుకున్నా.. బూస్టర్ డోస్‍గా ఇన్‍కోవాక్‌ నాజిల్ వ్యాక్సిన్‍ను తీసుకోవచ్చు.

ఇన్‍కోవాక్ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్‍కు మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది భారత్ బయోటెక్. ఈ టీకాతో దుష్పరిణామాలు ఉండవని తేలిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ నాజిల్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని సంస్థ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇన్‍కోవాక్ అనేది ప్రైమరీ 2 డోస్ షెడ్యూల్‍, హెటిరోలోగస్ బూస్టర్ డోస్ అని భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇది తమకు గొప్ప విజయమని పేర్కొన్నారు. నాజిల్ వ్యాక్సిన్‍ను తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగానికి కూడా ఇది ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‍లకు డిమాండ్ లేదని, అయినా భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షనల్ వ్యాధుల కోసం టెక్నాలజీ సిద్ధంగా ఉందని నిర్దారించుకునేందుకు తాము ఈ ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ అభివృద్ధిని కొనసాగించామన్నారు. నిర్దిష్ట కొవిడ్ వేరియంట్‍లకు వ్యాక్సిన్‍లను కూడా భవిష్యత్తు కోసం అభివృద్ధి చేస్తామని కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..