AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల 26న భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి.

కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాలపై వెనక్కు తగ్గని కేంద్రం.. పట్టువదలని రైతులు.. ఈ నెల 26న భారత్ బంద్
Balaraju Goud
|

Updated on: Mar 11, 2021 | 7:27 AM

Share

Farm acts protest : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతల్లో ఆగ్రహాం పెల్లుబిక్కింది. కేంద్రం తెచ్చిన వ్యవ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్యతిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని దేశవ్యాప్త రైతు సంఘాలు ఉద్యమబాట పట్టాయి.

నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరం. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించకపోతే ప్రైవేటు వ్యక్తులు సిండికేట్‌గా మారి రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసే అవకాశం ఉన్నదని రైతు సంఘాలు ఆరోపించాయి. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. అయితే, ఈ కాంట్రాక్టు ఒప్పందాలు బలమైన కార్పొరేట్లకు వరంగా మారి, రైతుకు ఉన్న హక్కులు హరించివేసే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతమైంది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం కేంద్రంగా చేసుకున్న రైతు సంఘాలు రిలీ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇందులో భాగంగా వేలాదిగా తరలివచ్చిన రైతులు ట్రాక్టర్లతో ఇటీవల ఢిల్లీ ముట్టడించి ఎర్రకోటపై నిరసన జెండాను ఎగురవేశారు. మరోవైపు, మహిళా రైతులు సైతం నిరసన గళం వినిపించారు. వారికి అన్నిపార్టీల మద్దతు పలుకుతున్నారు.

ఇదిలావుంటే, వ్యవసాయ చట్టాలపై కేంద్ర వెనక్కు తగ్గకపోవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనకు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అదే రోజు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌నకు రైతు సంఘాలు బుధవారం పిలుపునిచ్చాయి. మరోవైపు, పెరుగుతున్న ఇంధన ధరలు, రైల్వేల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15న కార్మిక సంఘాలతో కలిసి రైతులు నిరసన తెలుపుతారని రైతు నేత బూటా సింగ్‌ బూర్జ్‌గిల్‌ తెలిపారు. ‘‘మార్చి 26న పూర్తిగా, శాంతియుతంగా భారత్‌ బంద్‌ పాటిస్తాం’’ అని సింఘు సరిహద్దు వద్ద ఆయన విలేకరులతో చెప్పారు.

Read Also..  పంచాక్షరీ మంత్రంతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాలకు బారులు తీరిన భక్తులు.. మొదలైన హరిద్వార్‌ కుంభమేళా