Police: డబ్బుల కోసం మరీ ఇలానా..! బ్యాగ్‌లో గంజాయ్‌ ప్యాకెట్‌ వేసి అర్ధరాత్రి పోలీసుల వేధింపులు.. చివరకు..

డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. పోలీసులు తనను ఆపారని.. అనంతరం బ్యాగ్‌లో గంజాయి వేసి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ ఉద్యోగి పోలీసులపై ఆరోపించడం కలకలం రేపింది.

Police: డబ్బుల కోసం మరీ ఇలానా..! బ్యాగ్‌లో గంజాయ్‌ ప్యాకెట్‌ వేసి అర్ధరాత్రి పోలీసుల వేధింపులు.. చివరకు..
Drugs Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2023 | 5:19 PM

డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. పోలీసులు తనను ఆపారని.. అనంతరం బ్యాగ్‌లో గంజాయి వేసి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ ఉద్యోగి పోలీసులపై ఆరోపించడం కలకలం రేపింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనపై బాధిత వ్యక్తి ఫిర్యాదు చేయనప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు బెంగుళూరు పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ.. వేధింపులకు గురిచేస్తున్నారని ట్విట్ చేశాడు. హిమాచల్‌ కు చెందిన వైభవ్ పాటిల్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వైభవ్ పాటిల్ రాత్రి షిఫ్ట్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని ట్వీట్‌లో తెలిపాడు.

బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు పోలీసు అధికారులు తనను రోడ్డుపై ఆపి ప్రశ్నించారని, అందుకు తాను సహకరించారని పాటిల్ పేర్కొన్నాడు. అనంతరం అధికారులు తన బ్యాగ్‌ను తనిఖీ చేయడం ప్రారంభించారని.. అందులో గంజాయి ప్యాకెట్‌ను వేసి డబ్బులు వసూలు చేశారంటూ పాటిల్ ట్వీ్‌ట్‌లో పేర్కొన్నాడు. దీనిని ప్రశ్నించినందుకు తనపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేస్తానని బెదిరించడంతోపాటు.. గంజాయి సేవించినట్లు అంగీకరించాలంటూ బలవంతం చేశారని పేర్కొన్నాడు. ఈ సమయంలో తనను అరెస్టు చేస్తే పోలీసు అధికారులు ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బహుమతిగా వస్తానని చెప్పారని పాటిల్‌.. పేర్కొన్నాడు. చివరకు తన వద్ద ఉన్న రూ.2,500 ఇచ్చిన తర్వాత పోలీసులు విడిచిపెట్టారని ఆరోపించాడు.

6 నెలల నుంచి బెంగళూరులో ఉంటున్నాని.. ఇలాంటి వివక్ష తప్ప మరేమీ ఎదుర్కోలేదంటూ గురువారం పాటిల్ ట్వీట్ చేశాడు. అర్థరాత్రి రాపిడో బైక్‌ ట్యాక్సీలో వెళుతుండగా బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో తనను ఇద్దరు పోలీసు అధికారులు వేధించారని, గంజాయిని కలిగి ఉన్నారంటూ కేసు పెడతామని బెదిరిచారని పేర్కొన్నాడు. ఈ ఆరోపణల అనంతరం పాటిల్‌ ఆ ట్విట్లను వైభవ్‌ డిలిట్‌ చేశాడు. దీనిపై వైభవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..“నేను అధికారులతో మాట్లాడాను.. మీడియా కాల్‌లతో ఇబ్బంది పెడుతున్నందున ట్వీట్లను తీసివేయమని పోలీసులు తనను కోరారని.. ఈ సమస్యను అందరి ముందుకు తెచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..” అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

“ఒక అధికారి నా వైపు తిరిగి ప్రశ్నించారు.. నేను ఎక్కడ నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను.. ఏమి చేస్తున్నాను వంటి ప్రశ్నలు అడిగారు. నేను సహకరించి సమాధానం చెప్పాను. ఈ క్రమంలో మరో అధికారి బ్యాగ్‌ తెరిచి చూపించాలంటూ తీసుకున్నారని.. చెక్‌ చేస్తూ ఓ ప్యాకెట్‌ తీశారని.. అదెమిటో తాను గుర్తించలేకపోయానని.. అప్పుడు నువ్వు గంజాయి తాగుతున్నావా? అంటూ వేధించారని పేర్కొన్నాడు. పోలీసు అధికారులు తన వద్ద నుంచి రూ.2,500 తీసుకున్నారని, ఏటీఎం కార్డు లేకపోవడంతో ఎక్కువ డబ్బులు ఇవ్వలేకపోయానని చెప్పాడు. సంఘటన సమయంలో పోలీసు అధికారులు యూనిఫాంలోనే ఉన్నారని పాటిల్ చెప్పారు

పాటిల్‌ ట్వీట్లపై డీసీపీ సీకే బాబా స్పందించారు. దీనిపై పాటిల్‌ ఆందోళన చెందుతున్నారని, భయపడుతున్నారని అర్థం చేసుకున్నాం.. వివరాలను మెస్సెజ్‌ చేయాలని, వీలైనంత త్వరగా తన కార్యాలయంలో కలవమని అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారని.. విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆరోపించిన వ్యక్తి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే, ట్వీట్‌ను డిలీట్ చేయమని పోలీసులు అడిగారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. వైభవ్‌ని అస్సలు అలా అడగలేదని బాబా చెప్పారు.

కాగా, 2022 డిసెంబర్‌లో నగరంలో అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న జంటను ఆపి బలవంతంగా డబ్బులు అడిగిన ఇద్దరు పోలీసు అధికారులను బెంగళూరు పోలీసులు సస్పెండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!