Tata CNG Cars: సరికొత్త టెక్నాలజీలో టాటా కార్లు.. కిలో సీఎన్‌జీతో 30 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఫీచర్లు, లుక్ ఇవే..

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ, అవిన్యా ఈవీ కాన్సెప్ట్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. వీటితోపాటు తన రెండు ప్రముఖ మోడల్స్ టాటా ఆల్ట్రోజ్, పంచ్ మినీ ఎస్ యూవీ సీఎన్జీ వెర్షన్‌లను కూడా ప్రదర్శించింది.

Tata CNG Cars: సరికొత్త టెక్నాలజీలో టాటా కార్లు.. కిలో సీఎన్‌జీతో 30 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఫీచర్లు, లుక్ ఇవే..
TATA CNG Cars
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 13, 2023 | 6:29 PM

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు.. అధికమవుతున్న కాలుష్యం నేపథ్యంలో మార్కెట్లో పర్యావరణ హిత వాహనాలకు డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా ఈ తరహా వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్లను పలు కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. వీటితో పాటు సీఎన్ జీ(CNG) వాహనాలు కూడా ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ, అవిన్యా ఈవీ కాన్సెప్ట్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. వీటితోపాటు తన రెండు ప్రముఖ మోడల్స్ టాటా ఆల్ట్రోజ్, పంచ్ మినీ ఎస్ యూవీ సీఎన్జీ వెర్షన్‌లను కూడా ప్రదర్శించింది. ఈ రెండు సీఎన్ జీ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

టాటా ఆల్ట్రోజ్ సీఎన్ జీ..

టాటా ఆల్ట్రోజ్ సీఎన్ జీ1.2L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్ జీ కిట్‌ తో వస్తుంది. సీఎన్ జీ పై ఈ ఇంజిన్ ను రన్ చేసినప్పుడు మోడల్ పవర్ అవుట్‌పుట్‌లో కొంచెం తగ్గుదల (10bhp -15bhp) ఉంటుంది. అదే రెగ్యులర్ పెట్రోల్ తో అయితే 110bhp టాప్ పవర్, 140Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది వారి స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ CNG హ్యాచ్‌బ్యాక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ను అందిస్తుంది.

టాటా పంచ్ సీఎన్ జీ..

టాటా పంచ్ సీఎన్ జీ వెర్షన్ కు గత సంవత్సరం పలు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు దీనిని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. ఈ సీఎన్ జీ మోడల్ కూడా పెట్రోల్ మోడల్ వలె అదే 1.2L 3-సిలిండర్ రివాట్రన్ ఇంజిన్‌తో వస్తుంది. అయితే, పవర్, టార్క్‌లో స్వల్ప తగ్గుదల ఉంటుంది. సీఎన్ జీ మోడ్‌లో, ఇది 70-75bhp, 100Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ సుమారు 30కిమీ/కిలో ఉంటుందని అంచనా. ఆల్ట్రోజ్ సీఎన్ జీ వలె, ఇది కూడా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

టాటా పంచ్ CNG ఫీచర్లు..

దిగువ, మధ్య-స్థాయి వేరియంట్‌లు ఈ మోడల్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మినీ సీఎన్ జీ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ స్వే కంట్రోల్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, 15-అంగుళాల స్టీల్ వీల్స్‌ను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా పొందుతుంది. మిడ్-స్పెక్ వేరియంట్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 4-ఇంచ్ డిస్‌ప్లే , 4 స్పీకర్‌లతో కూడిన ఆడియో సిస్టమ్, రిమోట్ కీ లాక్/అన్‌లాక్, పవర్ విండోస్, పవర్డ్ ORVM, USB ఛార్జింగ్ సాకెట్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. దీనిని ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారో దానిని ఆ కంపెనీ ప్రకటించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..