బెంగళూరులో 12వేలను దాటేసిన కంటైన్మెంట్‌ జోన్లు

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులతో పాటు కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

బెంగళూరులో 12వేలను దాటేసిన కంటైన్మెంట్‌ జోన్లు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 7:30 PM

Bengaluru Containment Zones: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులతో పాటు కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే(BBMP)విడుదల చేసిన డేటా ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం కంటైన్మెంట్‌ల సంఖ్య 12,781కు పెరిగింది. సోమవారం వరకు ఈ సంఖ్య 12,325 ఉండగా.. వాటి సంఖ్య మరింత పెరిగింది. అందులో ఎక్కువగా ఉత్తర బెంగళూరులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బీబీఎమ్‌పీ డేటా ప్రకారం ఉత్తర బెంగళూరులో 3,935, తూర్పు బెంగళూరులో 2,256, పశ్చిమ బెంగళూరులో 1,770, బొమ్మనహళ్లిలో 1,548, ఆర్‌ఆర్‌ నగర్‌లో 1,124, మహాదేవపుర 937, యెలహంక 437, దసరహల్లి 318 యాక్టివ్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా ఉన్నాయి. ఇక ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా 30 నుంచి 39 వయసు వారే ఎక్కువగా ఉన్నారని బులెటిన్‌లో వెల్లడించారు. అలాగే 20-29, 40-49 వయసు వారికి వైరస్‌ ఎక్కువగా సోకోతోందని తెలిపారు. ఇక బీబీఎమ్‌పీ పరిధిలో 198 కరోనా వార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read This Story Also: నా థియేటర్లను ఇప్పట్లో తెరవను: సురేష్ బాబు