Breaking: అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం
దేశవ్యాప్తంగా అన్‌లాక్ 2.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగష్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో కఠినతర లాక్ డౌన్ కొనసాగుతుందని..

Unlock 3.0 Guidelines: దేశవ్యాప్తంగా అన్‌లాక్ 2.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగష్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో కఠినతర లాక్ డౌన్ కొనసాగుతుందని.. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై యధావిధిగా ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్రం పేర్కొంది. అటు రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు ఎత్తివేసింది. ఇదిలా ఉంటే ఆగష్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లను తెరుచుకునేందుకు అనుమతించింది. ఇక వందేమాతరం మిషన్‌లో భాగంగా హోంశాఖ అనుమతించిన విదేశీ విమాన సర్వీసులు మాత్రమే తిరుగుతాయని స్పష్టం చేసింది.
సినిమా హాళ్లు, థియేటర్లు, బార్లు, స్విమ్మింగ్ పూళ్లు, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలపై ఆంక్షల కొనసాగనున్నాయి. రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వేడుకలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగనుంది. సోషల్ డిస్టెన్స్ నిబంధనలతోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం రాష్ట్రాలకు లేదని.. స్థానిక స్థితిగతులకు తగ్గట్టుగా అదనపు ఆంక్షలు విధించుకోవచ్చునని వెల్లడించింది. ఇక శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపులో కోవిడ్-19 ఆరోగ్య సూత్రాలు తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. కాగా, నిబంధనలు ఉల్లంఘించేవారికి నష్ట పరిహారం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంది.
Also Read:
అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు
Ministry of Home Affairs (MHA) issues #Unlock3 guidelines. Restrictions on the movement of individuals during night have been removed. Yoga institutes and gymnasiums will be allowed to open from August 5, 2020. pic.twitter.com/eTTJwWei0K
— ANI (@ANI) July 29, 2020




