AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంగా ఫోటో దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. మీకు తేడా కొట్టడం లేదా

 పూల కుండీల్లో గంజాయి మొక్కలు నాటిన ఓ జంట అనూహ్యరీతిలో అడ్డంగా బుక్ అయ్యారు. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. 

అందంగా ఫోటో దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. మీకు తేడా కొట్టడం లేదా
Bengaluru Couple (AI Generated image)
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2024 | 11:50 AM

Share

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ జంట తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, ఇటీవల ఉర్మిత తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేశారు. ఐతే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు. 54 గ్రాములు ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. దంపతులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us