AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : 87 పరుగులతో అజేయంగా నిలిచిన సీఎస్కే ఓపెనర్.. సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?

Sanju Samson : 156 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ అజేయంగా 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎గా నిలిచాడు. అయితే చేతిలో వికెట్లు ఉన్నాయి, క్రీజులో సెటిల్ అయిపోయాడు.. మరి సంజూ సెంచరీ ఎందుకు చేయలేదు? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం అతడే స్వయంగా వివరించాడు.

Sanju Samson : 87 పరుగులతో అజేయంగా నిలిచిన సీఎస్కే ఓపెనర్.. సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
Sanju Samson
Rakesh
|

Updated on: May 06, 2026 | 7:20 AM

Share

Sanju Samson : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం జోరందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. 156 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ అజేయంగా 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎గా నిలిచాడు. అయితే చేతిలో వికెట్లు ఉన్నాయి, క్రీజులో సెటిల్ అయిపోయాడు.. మరి సంజూ సెంచరీ ఎందుకు చేయలేదు? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం అతడే స్వయంగా వివరించాడు.

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 87 పరుగుల వద్దే ఎందుకు ఆగిపోయాడనే ప్రశ్నకు సమాధానంగా అతను చాలా పరిణతి చెందిన మాటలు చెప్పాడు. “నిజం చెప్పాలంటే సెంచరీలు ఎప్పుడూ స్పెషలే. కానీ సెంచరీ చేరుకోవాలంటే నేను కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచించాల్సి వచ్చేది. క్రీజులో రెండో వైపు పార్ట్నర్ (కార్తీక్ శర్మ) అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఆపి నాకు సింగిల్ ఇవ్వు.. నేను సెంచరీ చేసుకుంటా అని అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే గేమ్ ఫినిష్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాను” అని సంజూ వివరించాడు. నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ గెలిపించడంలో వచ్చే సంతృప్తి సెంచరీ కంటే ఎక్కువని అతను చెప్పుకొచ్చాడు.

మైదానంలో సంజూ చాలా కూల్‌గా కనిపిస్తాడు. దీనిపై స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. కాకపోతే ఇప్పుడు మీరు నన్ను మైదానంలో ఎక్కువ సేపు చూస్తున్నారు, అందుకే నేను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు మీకు అనిపిస్తోంది. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నా ఇంతే ప్రశాంతంగా ఉంటాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. తన గేమ్ ప్లాన్ గురించి చెబుతూ, పవర్‌ప్లేలో కొంచెం సమయం తీసుకున్నా, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై విరుచుకుపడే సత్తా తనకి ఉందని, అదే ప్లాన్‌ను అమలు చేశానని తెలిపాడు.

బౌలర్లను తికమక పెట్టడానికి సంజూ క్రీజును విభిన్నంగా వాడుతుంటాడు. గత మూడు ఐదు ఏళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నట్లు అతను చెప్పాడు. బౌలర్ వేసే బంతిని బట్టి, వికెట్ స్వభావాన్ని బట్టి మూమెంట్ ఇస్తుంటానని, ఇది మానసిక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రస్తుతం తాను బేసిక్స్‌కు కట్టుబడి ఆడుతున్నానని, గత రెండు మూడు నెలలుగా చేస్తున్న కృషితోనే ఈ ఫామ్ సాధ్యమైందని సంజూ వెల్లడించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..
ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..
చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!
చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!
ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!
IAF అధికారి భార్యపై ఆమె స్నేహితుడి దారుణం
IAF అధికారి భార్యపై ఆమె స్నేహితుడి దారుణం
ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి!
ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!