AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో కేంద్రం అదిరిపోయే న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి అధిక సొమ్ము.. మీకు కూడా..

కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పీఎఫ్ కనీస పెన్షన్ పరిమితిని రూ.3 వేలకు పెంచనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే జరిగితే చిన్న ఉద్యోగులకు బెనిఫిట్ జరగనుంది. 58 ఏళ్ల తర్వాత అధిక పెన్షన్ ప్రతీ నెలా పొందనున్నారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో కేంద్రం అదిరిపోయే న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి అధిక సొమ్ము.. మీకు కూడా..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: May 06, 2026 | 7:25 AM

Share

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్లో నిల్వ చేసుకునే సొమ్ముపై వడ్డీతో పాటు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 పథకం కింద పెన్షన్ సదుపాయం అమల్లో ఉంది. ఈపీఎఫ్‌వోకు కాంట్రిబ్యూట్ చేసే సొమ్ములో కొంత పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. 58 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ అందిస్తారు. అయితే ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని త్వరలో కేంద్రం రూ.3 వేలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పెరగడం వల్ల అసలు ఏం జరుగుతుంది..? ఎవరికి ప్రయోజనం? పెన్షన్ ఎంతవరకు పెరుగుతుంది..? అనే డీటైల్స్ చూద్దాం.

పెన్షన్ ఎలా లెక్కిస్తారు..?

నెలకు రూ.15 వేలల్లోపు బేసిక్ శాలరీ పొందేవారు ఖచ్చితంగా ఈపీఎఫ్‌వో అకౌంట్ కలిగి ఉండాలి. ఆ పైన జీతం ఉన్నవారికి ఆప్షనల్‌గా చెప్పవచ్చు. యాజమాన్యం, ఉద్యోగి పరస్పర అంగీకారంతో ఆ పైన జీతం పొందేవారు పీఎఫ్ స్కీమ్‌లో చేరవచ్చు. జీతంలో 12 శాతం సొమ్ము కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేశారు. ఇందుకు సమానమైన మొత్తాన్ని కంపెనీ క్రెడిట్ చేస్తోంది. ఇక ఈ సొమ్ములో కొంతమొత్తం ప్రత్యేకంగా పెన్షన్ పథకం  కింద జమ చేస్తారు. ఇక కేంద్రం కూడా కొంత మొత్తం జమ చేస్తోంది. 58 ఏళ్ల తర్వాత వీటిని ప్రతీ నెలా పెన్షన్ కింద అందిస్తారు.  ఇవి తీసుకోవాలంటే కనీసం 10 ఏళ్లు ఈపీఎఫ్‌వోకు కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం పరిస్థితుల వల్ల అవి సరిపోడం లేదు. దీంతో పెన్షన్ పెంచాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం త్వరలో పెన్షన్ పెంచనుందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురుగా చెప్పవచ్చు.

ఎవరికి ఎంత వస్తుంది..?

(చివరి 60 నెలల సగటు జీతంx సర్వీస్ కాలం)/70 ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు. ఉదాహరణకు 60 నెలల సగటు జీతం రూ.10 వేలు ఉండి మీ సర్వీస్ 14 ఏళ్లు పూర్తయితే ప్రస్తుతం రూ.2 వేలు వస్తుంది. అదే రూ.3 వేలకు పెంచితే అదనంగా రూ.వెయ్యి వస్తాయి. ఇక సగటు జీతం రూ.12 వేలుగా ఉండి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుతం రూ.2057 అందుతుంది. అదే రూ.3 వేలకు పెంచితే అదనంగా రూ.943 రానుంది. అయితే తక్కువ జీతం ఉన్నవారికి పెన్షన్ పెంపు వల్ల అధిక లాభం జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. వీవరిలో 47 లక్షల మంది రూ.9 వేల కంటే తక్కువగా పొందుతున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర