AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలి.. త్రివిధ దళాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

భారత సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా.. రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే నిజమనిపిస్తుంది. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు పిలపునిచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.

యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలి.. త్రివిధ దళాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
Rajnath Singh
Balaraju Goud
|

Updated on: Sep 06, 2024 | 10:17 AM

Share

భారత సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా.. రక్షణ శాఖ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే నిజమనిపిస్తుంది. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు పిలపునిచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. భారత్‌ ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని , శాంతిని కాపాడడానికి యుద్దం చేయాల్సిన అవసరం రావచ్చని అన్నారు. లక్నోలో జాయింట్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్‌నాథ్‌. సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో త్రివిధ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. రష్యా – ఉక్రెయిన్‌ , ఇజ్రాయెల్‌ -హమాస్‌ , బంగ్లాదేశ్‌లో అలర్లను ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు . అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వస్తే సంసిద్దంగా బలగాలు ఉండాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశముందని అన్నారు. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ భారత్‌ తమ లక్ష్యమన్నారు.

భవిష్యత్‌లో వచ్చే యుద్దాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా త్రివిధ బలాలను సిద్దం చేస్తునట్టు రక్షణశాఖ మంత్రి తెలిపారు. యుద్దాలను ధీటుగా ఎదుర్కొనేలా రెడీగా ఉన్నట్టు తెలిపారు. సవాళ్లను ముందుగానే గుర్తించాలని కమాండర్లకు రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని కోరారు. సరిహద్దు దేశాల్లో ఉన్న సమస్యలు భారత్‌కు కూడా సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఇవి శాంతికి , స్థిరత్వానికి ఆటంకం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ప్రపంచంలో పలు దేశాలు యుద్దంతో ప్రభావితమవుతున్నప్పటికి , ఆ ప్రభావం భారత్‌పై లేకుండా చూస్తునట్టు వెల్లడించారు. అయితే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టం చేశారు.

మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ , భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్దంగా ఉండాలని ఆర్మీ కమాండర్లతో చెప్పారు రాజ్‌నాథ్‌. జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యమన్నారు . సాంప్రదాయ యుద్దసామాగ్రితో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలన్నారు.

స్పేస్‌ ,ఎలక్ట్రానిక్‌ వార్‌ యుద్ద విధాలనాలపై దృష్టి పెట్టినట్టు రాజ్‌నాథ్‌ తెలిపారు. డేటా , కృత్రిమ మేథను కూడా కూడా యుద్ద విద్యలకు జోడించాలన్నారు. నేరుగా యుద్దంపై ఈ విధానాలు ప్రభావం చూపకపోయినప్పటికి పరోక్షంగా సాయపడుతాయన్నారు. భవిష్యత్‌లో రక్షణరంగంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు కమాండర్ల కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..