CM Basavaraj Bommai: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణం స్వీకారం

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 28, 2021 | 11:20 AM

ర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా బుధవారం ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై అను నేను అంటూ..

CM Basavaraj Bommai: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణం స్వీకారం
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంగా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా బుధవారం ఉదయం 11 గంటలకు బసవరాజు బొమ్మై అను నేను అంటూ.. ఆయన ప్రమాణస్వీకారం చేశారు.  ఆ రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదిలావుంటే.. మంగళవారం బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే.

అనేక ఊహాగానాల మధ్య ఆయనకే సీఎం పీఠం దక్కింది.  క్లిష్ట పరిస్థితుల్లో తనపై నమ్మకం ఉంచి.. బాధ్యతలు అప్పగించిన పార్టీకి బసవరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. తనకి ఈ పదవి వస్తుందని ఊహించలేదన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోయినప్పటికీ.. యడియూరప్ప తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను సూచించిన వ్యక్తికే సీఎం పీఠం దక్కేలా లైన్ క్లియర్ చేసుకున్నారు. యడియూరప్పకు నమ్మకస్తుడిగా బొమ్మైకి గుర్తింపు ఉంది.

కొత్త ముఖ్యమంత్రి రాకతో కార్యాలయంలో మార్పులు ఇలా…

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu