భారత చట్టాలను పాటిస్తాం, దిగివచ్చిన సోషల్ మీడియా సంస్థలు,..ఇంకా నిర్ణయం తీసుకోని ట్విటర్

భారతీయ చట్టాలను తప్పకుండా పాటిస్తామని, వీటికి అనుగుణంగా నడుచుకుంటామని ట్విటర్ మినహా ఏడు సోషల్ మీడియా సంస్థలు భారత ప్రభుత్వానికి హామీనిచ్చాయి.

భారత చట్టాలను పాటిస్తాం, దిగివచ్చిన సోషల్ మీడియా సంస్థలు,..ఇంకా నిర్ణయం తీసుకోని  ట్విటర్
Twitter

భారతీయ చట్టాలను తప్పకుండా పాటిస్తామని, వీటికి అనుగుణంగా నడుచుకుంటామని ట్విటర్ మినహా ఏడు సోషల్ మీడియా సంస్థలు భారత ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ఈ మేరకు సమాచార, ఎలెక్ట్రానిక్ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపాయి, ఇండియాలో తమ చీఫ్ సమన్వయ అధికారులు, నోడల్, కాంటాక్ట్ సిబ్బంది, గ్రివాన్స్ ఆఫీసర్ తదితరుల నియామకాలకు సంబంధించిన వివరాలను ఇవి షేర్ చేశాయి. టెలిగ్రామ్, కూ, గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి మీ గైడ్ లైన్స్ కి లోబడి ఉంటామని స్పష్టం చేశాయి. ఈ నూతన నిబంధనలు తమకు సమ్మతమేనని పేర్కొన్నాయి. ఈ సంస్థల ఉద్యోగులు ఇండియాలోనే పని చేస్తుండాలని, వారు భారతీయులే అయి ఉండాలన్న ప్రధాన నిబంధన వీటిలో ఉంది. కాగా ట్విటర్ మాత్రం ఈ రూల్స్ పై ఇంకా తమ స్పందనను తెలియజేయలేదు. అయితే ఇండియాలో పని చేసే తమ న్యాయవాద సంస్థే తమ నోడల్ కాంటాక్ట్ పర్సన్ గా… గ్రివాన్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తుందని ఈ సంస్థ పేర్కొంది. ప్రభుత్వానికి ఏవైనా అనుమానాలు వస్తేఈ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. తమ నిబంధనల అమలుకు కేంద్రం వీటికి 3 నెలల సమయం ఇచ్చిన విషయం గమనార్హం. గత ఫిబ్రవరి 23 న కేంద్రం వీటికి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే తమ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగేలా తాము ప్రవర్తించే ప్రసక్తే లేదని అంటూ వాట్సాప్ ఢిల్లీహైకోర్టు కెక్కినప్పటికీ ప్రభుత్వం దీనీపై వివరణ ఇస్తూ…. .యూజర్ల ప్రాథమిక హక్కుల పరిరక్షణ మొదట తమ పరిధిలోకి వస్తుందని, , దీనిపై మీరు ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది.

కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంలో ఆ పార్టీకి, బీజేపీకి మధ్య రేగిన రగడ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు అత్యధిక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి .

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )

River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )

David Warner: వార్నర్ కు తెలుగు రాయడం తెలుసా..!! తన భార్యకు తెలుగులో లవ్ ప్రపోజ్… ( వీడియో )

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu