Bharath Bandh: రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు బ్యాంకు సంఘాల మద్ధతు.. బ్యాంకులు పనిచేస్తాయా?..
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనను చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనను చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకకు తగ్గకపోవడంతో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి. పలు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా రైతులకు మద్దతునిస్తున్నారు.
అటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా రైతులకు మద్ధతు ప్రకటించాయి. కాగా భారత్ బంద్ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొంటారా? బ్యాంకులు పనిచేస్తాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై తాజాగా బ్యాంకు సంఘాలు వివరణ ఇచ్చాయి. తాము రైతులకు కేవలం సంఘీభావం మాత్రమే ప్రకటించామని.. బంద్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. రైతులకు మద్ధతుగా పని గంటల ముందు, ఆ తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. నల్లరంగు బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని తెలిపారు.
రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మా ఉద్యోగ సంఘం మద్ధతు ఇస్తుంది అని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్ సెక్రెటరీ సౌమ్య దత్తా తెలిపారు. తాము ధర్నాలు చేపట్టడం లేదని, బంద్‌లో పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.