Republic Day Parade: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న బంగ్లాదేశ్ త్రివిధ దళాలు.. విదేశీ అతిథి లేకుండా వేడుకలు
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహించడానికి..
Republic Day Parade: 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల నడుమ రిపబ్లిక్ డే నిర్వహించడానికి ఏర్పట్లు చేస్తున్నారు. మరో వైపు కవాతులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ త్రివిధ దళాలు రెడీ అవుతున్నాయి. భారత దేశం సహాయంతో బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ దళాలు రిపబ్లిక్ డే వేడుకల్లో భాగస్వామ్యం కానున్నాయి.
గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే బంగ్లాదేశ్ త్రివిధ దళాలకు మొహత్సిమ్ హైదర్ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. కవాతులోని మొదటి ఆరు వరుసల్లో బంగ్లాదేశ్ సైన్యం, ఆ తర్వాతి రెండు వరుసల్లో నావికా దళం, ఆ తర్వాతి రెండు వరుసల్లో బంగ్లాదేశ్ వైమానిక దళం ఉంటాయని చెప్పారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ ప్రత్యేక అతిథి హాజరు కావడం లేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు రిపబ్లిక్ డే నిర్వహణను కోవిడ్-19 నిబంధనల నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1.5 మీటర్ల సోషల్ డిస్టాన్సింగ్‌తో మార్చ్ చేయనున్నారు.
Also Read: మటన్, చికెన్ ల కంటే సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు ఆరోగ్యానికి అత్యంత మేలు