శశికళ ఆరోగ్యం నిలకడగా ఉంది, కోవిడ్ పాజిటివ్ లక్షణాలు తగ్గాయి. నడుస్తున్నారు, బెంగుళూరు ఆస్పత్రి వర్గాలు

అన్నా డీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు..

  • Umakanth Rao
  • Publish Date - 4:18 pm, Sun, 24 January 21
శశికళ ఆరోగ్యం నిలకడగా ఉంది, కోవిడ్ పాజిటివ్ లక్షణాలు తగ్గాయి. నడుస్తున్నారు, బెంగుళూరు ఆస్పత్రి వర్గాలు

అన్నా డీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు తగ్గాయని బెంగుళూరులో ఈమె చికిత్స పొందుతున్న విక్టోరియా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  ఓరల్ ఫుడ్ తీసుకుంటున్నారని, సపోర్ట్ సాయంతో నడుస్తున్నారని ఈ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కోవిడ్ పాజిటివ్ కి గురైన శశికళ ఆరోగ్యం నిన్న మొన్నటివరకు కొంత ఆందోళనకరంగా కనిపించింది. మరో రెండు వారాలు ఆమె చికిత్స పొందాల్సి ఉంటుందని ఈ హాస్పటల్ వెల్లడించింది. అయితే ఆమె హెల్త్ చాలావరకు మెరుగు పడినట్టు తాజాగా డాక్టర్లు వెల్లడించారు. కాగా ఆమెను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్నది ఇంకా తెలియడంలేదు.

ఆదాయానికి మించిన ఆస్తుల  కేసులో శశికళ సుమారు నాలుగేళ్లు పరప్పన అగ్రహార జైల్లో గడిపారు.  ఆమె ఈ నెల 27 న జైలు నుంచి విడుదల కావలసి ఉండగా అకస్మాత్తుగా అస్వస్తతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇలా ఉండగా శశికళను మళ్ళీ అన్నా డీఎంకే లో చేర్చుకునే ప్రసక్తి లేదని తమిళనాడు సీఎం పళనిస్వామి ఇదివరకే తెలిపారు. గతంలో ఈమె వర్గం ఈ పార్టీలో విలీనం కావచ్చునని వార్తలు వచ్చాయి. త్వరలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ శశికళ హవా తలెత్తితే తమ పార్టీకి కీడు కలగవచ్చునని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నట్టు కనబడుతోంది.