AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదరం, బెదరం, పోలీసులు అనుమతించకున్నా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతాం, అన్నదాతల సంఘాల వెల్లడి

ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ..

అదరం, బెదరం, పోలీసులు అనుమతించకున్నా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతాం, అన్నదాతల సంఘాల వెల్లడి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 24, 2021 | 3:56 PM

Share

ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రదర్శన జరుగుతుందని ఆయన చెప్పారు. ఇందుకు వారి అనుమతితో తమకు నిమిత్తం లేదన్నారు. ఏయే రూట్లలో ర్యాలీ జరగాలో తమకు, పోలీసులకు మధ్య ఓ అంగీకారం కుదిరినట్టు ఆయన వెల్లడించాడు. క్రమశిక్షణతో, శాంతియుతంగా తాము కాగా-దీన్ని నిర్వహిస్తామన్నారు. నాలుగు రూట్ల ద్వారా ర్యాలీ నిర్వహణకు వీరికి, పోలీసులకు మధ్య ఒప్పందం వంటిది కుదిరింది. సింఘు, టిక్రి బోర్డర్స్, ఘాజీపూర్ యూపీ గేట్, చిల్లా రూట్ల ద్వారా ఇది సాగనుంది.ఈ ర్యాలీలో 2 లక్షల ట్రాక్టర్లతో అన్నదాతలు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల రైతులు కూడా సింఘు బోర్డర్ చేరుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల అన్నదాతలు మొదటి నుంచి నిరసన చేస్తున్నారు. అటు- ఇప్పటివరకు సుమారు 70 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురై కొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు చనిపోయారు.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?