AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir Inauguration: ఉదయం 10 గంటల నుంచే మంగళ ధ్వని ప్రారంభం.. 18 రాష్ట్రాలకు చెందిన కళాకారుల నిరాజనం

అయోధ్యలో ఆధ్యాత్మిక కోలాహలం ఉట్టిపడింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మంగళ ధ్వనితో నిరాజనం పలుకుతున్నారు. ఈప్రొగ్రాంలో 18రాష్ట్రాలకు చెందిన 50మంది ప్రముఖ కళాకారులు భాగస్వాములు అవుతున్నారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో..

Ayodhya Ram Mandir Inauguration: ఉదయం 10 గంటల నుంచే మంగళ ధ్వని ప్రారంభం.. 18 రాష్ట్రాలకు చెందిన కళాకారుల నిరాజనం
Ayodhya Ram Mandir
Srilakshmi C
|

Updated on: Jan 22, 2024 | 9:44 AM

Share

అయోధ్య, జనవరి 22: అయోధ్యలో ఆధ్యాత్మిక కోలాహలం ఉట్టిపడింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మంగళ ధ్వనితో నిరాజనం పలుకుతున్నారు. ఈప్రొగ్రాంలో 18రాష్ట్రాలకు చెందిన 50మంది ప్రముఖ కళాకారులు భాగస్వాములు అవుతున్నారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వని స్టార్ట్ అవుతుంది. దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాలకు చెందిన వాయిద్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన 50కి పైగా మంత్రముగ్ధులను చేసే సంగీత వాయిద్యాలను దాదాపు 2 గంటల పాటు ప్లే చేసి మంగళ్ ధ్వనిని రూపొందించనున్నారు. ఈ గొప్ప సంగీత కార్యక్రమం శ్రీరాముని గౌరవార్థం విభిన్న సంప్రదాయాల ఐక్యతకు ప్రతీకగా నిలవనుంది. వీటిలో పఖావాజ్, వేణువు, ఆంధ్రప్రదేశ్‌లోని ఘటం, జార్ఖండ్‌లోని సితార్, గుజరాత్‌లోని శాంతర్, నాగస్వరం, తావిల్, మృదంగ్, ఉత్తరాఖండ్‌లోని హుడ్కా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధోలక్, కర్ణాటకకు చెందిన వీణ, మహారాష్ట్రకు చెందిన సుందరి, పంజాబ్‌కు చెందిన అల్గోజా, ఒడిశాకు చెందిన మర్దల్, మధ్యప్రదేశ్‌కు చెందిన సంతూర్, మణిపూర్‌కు చెందిన పుంగ్, అస్సాంకు చెందిన నగాడా, కాళీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తంబురా, బీహార్‌లోని పఖావాజ్, ఢిల్లీకి చెందిన షెహనాయి, రాజస్థాన్‌లోని రావణహత, శ్రీఖోల్, బెంగాల్‌లోని సరోద్ సంగీత వాయిద్యాల నైపుణ్యం ప్రసిద్ధ కళాకారులు ఈ ఈవెంట్‌లో ప్లే చేయడానికి ఎంపిక చేయబడ్డారు. మంత్రోచ్ఛారణకు ముందు సంగీతం ప్లే అవుతుంది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, అయోధ్య సాంస్కృతిక నిపుణుడు, కళాకారుడు యతీంద్ర మిశ్రా సమన్వయకర్తగా వ్యవహారిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో, మంగళ్ ధ్వని ఆనందాన్ని కలిగించడానికి.. ఒక శుభాన్ని సూచించడానికి దేవత ముందు ఉత్పత్తి చేయబడుతుందని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 25 ప్రముఖమైన, అరుదైన సంగీత వాయిద్యాల శుభాకాంక్షలతో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ముగుస్తుంది. ఆయా భాషల్లో నైపుణ్యం ఉన్న కళాకారులు దీన్ని ప్రదర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.