Chandrayaan-3: నిద్రావస్థలోనూ చంద్రయాన్-3 నుంచి సంకేతాలు.! ధ్రువీకరించిన ఇస్రో.
దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 నిద్రాణ స్థితిలోనూ తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ LRO ను అమర్చారు.
దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 నిద్రాణ స్థితిలోనూ తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ LRO ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే LRA జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. డిసెంబరు 12 నుంచి LRA నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది.
చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన LRAలను అమర్చినా నాసాకు చెందిన LRA నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో LRA పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్-3 నుంచి తూర్పు వైపునకు ఉన్న LROలోని లేజర్ అల్టిమీటర్ చంద్రయాన్-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి సంకేతాలు అందించగలుగుతుంది. ఇందులోని 8 పలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

