తాట తీస్తున్న వాహనాల చట్టం… ఆటో డ్రైవర్‌కు రూ.47,500 జరిమానా

నూతన వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపించడమే కాదు .. ముచ్చెమటలు పట్టిస్తోంది. సరైన పత్రాలు చూపించలేదనే కారణంతో ఓ వాహనదారుడికి ఏకంగా రూ.23వేలు చలానా రాసిన ఘటన మరిచిపోకముందే ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో మరో ఘటన వెలుగుచూసింది. ఓ ఆటోవాలకు ఏకంగా రూ.47,500 వేల ఫైన్ విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం చలాన్‌లు కాకపుట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారుల వీపు విమానం మోత […]

తాట తీస్తున్న వాహనాల చట్టం... ఆటో డ్రైవర్‌కు రూ.47,500 జరిమానా
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 8:37 PM

నూతన వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపించడమే కాదు .. ముచ్చెమటలు పట్టిస్తోంది. సరైన పత్రాలు చూపించలేదనే కారణంతో ఓ వాహనదారుడికి ఏకంగా రూ.23వేలు చలానా రాసిన ఘటన మరిచిపోకముందే ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో మరో ఘటన వెలుగుచూసింది. ఓ ఆటోవాలకు ఏకంగా రూ.47,500 వేల ఫైన్ విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు.

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం చలాన్‌లు కాకపుట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారుల వీపు విమానం మోత మోగించే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు. ఒడిషాలోని భువనేశ్వర్‌లో సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, పైగా లైసెన్స్ లేకపోవడం వంటి అతిక్రమణలకు భారీ మూల్యాన్ని చెల్లించాలని షాక్ తినిపించారు.

బుధవారం వాహనాల తనిఖీల్లో భాగంగా ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్‌ అనే వ్యక్తి నడిపిస్తున్న ఆటోను ఆపారు. దీంతో అతడి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతోపాటు మద్యం సేవించి వాహనాన్ని నడపడంతో ఇంతపెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించారు. అయితే తాను రూ.47,500 వేలు కట్టలేనని, కావాలంటే వాహనాన్ని సీజ్ చేయాలని, అవసరమైతే జైలుకైనా పంపించాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.

కొత్త వాహన రవాణ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ఒకవేళ అమలైతే ఎన్ని కేసులు సమోదవుతాయో.. ఎంతెంత చలాన్లు రాస్తారో అనే ఆసక్తి నెలకొంది.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం