అగస్టా వెస్ట్ లాండ్ కేసులో సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు

అగస్టా వెస్ట్ లాండ్ దర్యాప్తు కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది.(12 లగ్జరీ హెలికాఫ్టర్ల కొనుగోలులో రూ..3,600 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి).

అగస్టా వెస్ట్ లాండ్ కేసులో సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2020 | 2:06 PM

అగస్టా వెస్ట్ లాండ్ దర్యాప్తు కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది.(12 లగ్జరీ హెలికాఫ్టర్ల కొనుగోలులో రూ..3,600 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి). ఈ కేసులో మధ్యదళారి, బ్రిటిషర్ అయిన క్రిస్టియన్ మిషెల్ తో బాటు 15 మంది పేర్లతో కూడిన అనుబంధ చార్జిషీట్ ను సీబీఐ దాఖలు చేసింది. మిషెల్ ని రెండేళ్ల క్రితం దుబాయ్..ఇండియాకు అప్పగించింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అటు- మాజీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) శశికాంత్ శర్మ, మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేశార్లను కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ సంస్థకు రక్షణ శాఖ నంచి అనుమతి లభించింది.

ఈ భారీ కాంట్రాక్టు అగస్టా వెస్ట్ లాండ్ కి దక్కేలా చూసేందుకు మిషెల్ బ్యూరోక్రాట్లను ఎలా వలలో వేసుకున్నాడో ఈ చార్జిషీట్ లో సీబీఐ వివరించింది. దుబాయ్ లోని బిజినెస్ మన్  రాజీవ్ సక్సేనా సాయంతో   ప్రభుత్వ అధికారులకు   ఏ విధంగా ముడుపులు సమర్పించాడో, పకడ్బందీగా  వ్యవహారాన్ని ఎలా నడిపాడో కూడా వివరించారు.  ఈ కేసులో బ్రిటన్, యూఏఈ, మారిషస్, ఇటలీ, ట్యునీషియా దేశాల నుంచి లెటర్ రోగేటరీ ద్వారా సీబీఐ వివిధ డాక్యుమెంట్లను, ఆధారాలను ఏ సేకరించింది. 2007 లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ కాంట్రాక్టును  పొంది ఆరేళ్ళ తరువాత రద్దు చేసింది. ఆ నాడే ఈ వ్యవహారంలో రూ. 362 కోట్ల ముడుపులను ఆ సంస్థ చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి.