Wine Shops E-Bidding: ద్యేవుడా!.. ఈ వైన్ షాప్‌ కు ఇంత డిమాండ్ ఏంటి సామీ.. ఏకంగా రూ. 510 కోట్లు పెట్టేశారు..

Wine Shops E-Bidding: ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా మద్యమే ప్రధాన ఆదాయ వనరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏటా..

Wine Shops E-Bidding: ద్యేవుడా!.. ఈ వైన్ షాప్‌ కు ఇంత డిమాండ్ ఏంటి సామీ.. ఏకంగా రూ. 510 కోట్లు పెట్టేశారు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2021 | 10:17 PM

Wine Shops E-Bidding: ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా మద్యమే ప్రధాన ఆదాయ వనరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏటా మద్యం షాపులను వేలం వేయడం పరిపాటి. అయితే, మద్యం షాపుల వేలం వేస్తే చివరికి రూ. రెండు కోట్లు పలుకుతుంది. కానీ రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో రూ. 510 కోట్లు పలికింది. ఇప్పుడిదే దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్ అయ్యింది. వివరాల్లోకెళితే.. రాజస్థాన్ ప్రభుత్వం మద్యం షాపుల కోసం ఈ-వేలం నిర్వహించింది. ఇందుకోసం బిడ్లను ఆహ్వానించింది. అయితే రాజస్థాన్‌లోని హనుమాన్ నగర్‌ జిల్లా నోహార్‌లోని ఓ మద్యం దుకాణానికి మాత్రం యమా గిరాకీ ఉంది. దాని ప్రారంభ ధర రూ. 72.70 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఈ వేలంలో ఊహించని రీతిలో సదరు షాపునకు రూ. 510 కోట్ల బిడ్ దాఖలు చేశారు. అది చూసి అంతా అవాక్కయ్యారు. ఇది బేస్ ధర కంటే 708 రెట్లు ఎక్కవ.

దీనిపై ఎక్సైజ్ పాలసీ అదనపు కమిషనర్ సీఆర్ దేవాసి మాట్లాడారు. ఈ బిడ్డింగ్ చూసి షాక్ అయ్యాం. నోహార్‌లోని కిరణ్ కన్వర్ వైన్ షాప్‌కు రూ. 510 కోట్ల బిడ్ దాఖలైంది. అయితే దాఖలు చేసిన బిడ్ అమౌంట్‌ మొత్తంలో రెండు శాతం సొమ్మును మూడు రోజుల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇదే అంశంపై బిడ్డర్‌కు నోటీసులు కూడా పంపామని చెప్పారు. ఒకవేళ బిడ్ విన్నర్ డబ్బు చెల్లించకపోతే అతని కేటాయింపు రద్దు చేయడం జరుగుతుందన్నారు. అలాగే సదరు వ్యక్తి డబ్బు జమ చేయని యడల రూ. 1 లక్షకు పైగా సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేస్తామని చెప్పారు. కాగా, ఇదే వైన్‌షాపు గతేడాది రూ. 65 లక్షలు పలికింది. ఇప్పుడు ఏకంగా రూ. 510 కోట్లు పలుకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే హైలెట్ అని చెప్పాలి. ఇదిలాఉంటే చురు జిల్లాలోని ఓ వైన్ షాపును రూ. 11 కోట్లతో దక్కించుకున్నారు. జైపూర్‌లోని సంగనేర్‌లోని ఓ మద్యం దుకాణం ఈ వేలంలో రూ.8. 91 కోట్లు పలికింది. ఇలా దాదాపు పది పదిహేను షాపులు భారీగా మొత్తంతో దక్కించుకున్నారు బిడ్డర్లు.

Also read:

Aratikaya Podi Kura : ఎంతో రుచికరమైన అరటికాయ పొడి కూర తయారీ విధానం ఇలా…!

Women’s Day 2021: ఉన్మాదం చేసిన గాయంతో గొంతు పలకడం లేదు.. అయినా మంచంపై నుంచే మహిళా లోకానికి లేఖ రాసిన ప్రియాంక..