AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani case: పొలిటికల్‌ టర్న్ తీసుకున్న అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు..

Political Turn:అంబానీ ఇంటి ముందు కారులో పేలుడ పదార్ధాల కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై భగ్గుమంది శివసేన. కేంద్రం తీరు చాలా అనుమానాలకు తావిస్తోందని అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే.

Mukesh Ambani case: పొలిటికల్‌ టర్న్ తీసుకున్న అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు..
Ambani residence
Sanjay Kasula
|

Updated on: Mar 08, 2021 | 10:37 PM

Share

అంబానీ ఇంటి ముందు కారులో పేలుడ పదార్ధాల కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై భగ్గుమంది శివసేన. కేంద్రం తీరు చాలా అనుమానాలకు తావిస్తోందని అన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే. అయినప్పటికి మహారాష్ట్ర ఏటీఎస్‌ ఈ కేసులో వాస్తవాలను వెలుగు లోకి తెస్తుందని స్పష్టం చేశారు.

ముంబైలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈ కేసును ఎన్‌ఐఏకు కేంద్రం అప్పగించడంపై భగ్గుమన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే. కేంద్రం తీరు చాలా అనుమానాలకు తావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫిభ్రవరి 25వ తేదీన అంబానీ ఇంటి ముందు ఆగిన స్కార్పియోలో జిలెటిన్‌ స్టిక్స్‌ లభించాయి.

కేంద్ర హోంశాఖ ఆదేశాలపై ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి .. కాని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం యథాతథంగా ఉంటుందని, అధికారుల మీద విశ్వాసం ఉంచాలని అన్నారు ఉద్దవ్‌ థాక్రే. కారు యాజమాని మన్సూక్‌ హీరెన్‌ అనుమానాస్పద మృతిపై ఇప్పటికే మహారాష్ట్ర ఏటీఎస్‌ దర్యాప్తు చేస్తోందని, అలాంటప్పుడు ఎన్‌ఐఏ దర్యాప్తు అవసరం ఏంటని ప్రశ్నించారు.

ఇదే ఏటీఎస్‌ మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సమర్ధంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏటీఎస్‌ అధికారులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు లోకి తెచ్చే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. మహారాష్ట్రను బద్నాం చేసేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు ఉద్దవ్‌.

సిల్వస ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యపై కూడా ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని , కాని దీనిపై బీజేపీకి ఎందుకు సందేహాలు రావడం లేదన్నారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజుపుత్‌ కేసులో సీబీఐ దర్యాప్తు చివరకు ఏం తేల్చిందో ఎవరికి అర్ధం కాలేదన్నారు ఉద్దవ్‌.

అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసులో ముంబై ఏటీఎస్‌ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది . కారు యాజమాని మన్సూక్‌ హీరేన్‌ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే మన్సూక్‌ హీరెన్‌ ఆత్మహత్య చేసుకోలేదని , ముమ్మాటికి హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మహారాష్ట్ర పేరును బద్నాం చేస్తున్నారని శివసేన నేతలు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

Platform Ticket: ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే మీరు రైలు ప్రయాణం చేయవచ్చు.. ఎలాగో తెలుసా…! అయితే

Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..

Bigg Boss 4: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. బిగ్‌బాస్ సీజన్4 ఫేం అలేఖ్య హారికను వరించిన బంపర్ ఆఫర్..