AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Powerful Country In Asia: ఆసియాలో నంబర్ 4గా మారిన భారత్.. పడిపోయిన చైనా ర్యాంక్..!

బయటి ప్రపంచంతోపాటు వారి ప్రాంతంలో ఈ రెండు దేశాల ప్రభావం తగ్గింది. అయితే అమెరికా అద్భుతమైన దౌత్యం ద్వారా తన పట్టును బలోపేతం చేసుకోవడం విశేషం. ఆసియా ప్రాంతంలోని..

Most Powerful Country In Asia: ఆసియాలో నంబర్ 4గా మారిన భారత్.. పడిపోయిన చైనా ర్యాంక్..!
Asia Power Index 2021
Venkata Chari
|

Updated on: Dec 13, 2021 | 7:56 AM

Share

Asia Power Index 2021: కోవిడ్ మహమ్మారి కారణంగా, హిందూ, పసిఫిక్ మహాసముద్రంలో ఆసియా దేశాలైన భారత్, చైనా ప్రభావం తగ్గిందంట. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, బయటి ప్రపంచంతోపాటు వారి ప్రాంతంలో ఈ రెండు దేశాల ప్రభావం తగ్గింది. అయితే అమెరికా అద్భుతమైన దౌత్యం ద్వారా తన పట్టును బలోపేతం చేసుకోవడం విశేషం. ఆసియా ప్రాంతంలోని దేశాలపై అమెరికా ప్రభావం పూర్తిగా పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది.

నివేదికలో ఏముందంటే.. లోవీ ఇన్‌స్టిట్యూట్ ఏషియన్ పవర్ ఇండెక్స్ 2021 పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇందులో చైనా గురించి ఓ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాప్తి తర్వాత చైనా ప్రమాదంలో చిక్కుకపోయింది. దౌత్య, ఆర్థిక రంగంలో ఒంటరిగా మిగిలిపోయింది. చైనా వెనుకంజలో పడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఈ ప్రాంతంలో భారతదేశం నాల్గవ అతిపెద్ద శక్తిగా ఎదిగింది. అమెరికా, జపాన్, చైనా ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. కోవిడ్ మహమ్మారికి ముందు ఉన్న అభివృద్ధి వేగాన్ని పట్టుకోలేకపోయింది. దౌత్య, ఆర్థిక ప్రభావం కూడా ఒక సంవత్సరంలోనే తగ్గింది. అయితే అంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న భారత్ నేటికీ అలానే కొనసాగుతోంది.

ఊపందుకున్న అమెరికా.. ఆసియా శక్తుల బలమైన ఉనికి ఉన్నప్పటికీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రభావం మళ్లీ వేగంగా పెరిగింది. జో బిడెన్ పరిపాలన, బలమైన దౌత్యమే దీనికి కారణం. మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత అమెరికా వేగంగా కోలుకుంది. ఆర్థికంగానూ వేగం పుంజుకుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ పని కష్టంగా అనిపించింది. ఇండెక్స్‌లోని ఎనిమిది పాయింట్లలో ఆరింటిలో యూఎస్ బలమైనదిగా ఎదిగింది. నివేదిక ప్రకారం, భారతదేశం ఇప్పటికీ అమెరికాపై ఎక్కువగా ఆధారపడడం లేదు. అయినా, సైనిక, వ్యూహాత్మక దృక్కోణం నుంచి చైనాకు కఠినమైన సవాలును అందిస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు ధీటుగా తయారైంది.

యుద్ధం ముప్పు.. ఆసియా ప్రాంతంలో భద్రతకు సంబంధించిన అనేక విషయాలు నివేదికలో ప్రస్తావించారు. ఈ విషయంలో ఏలాంటి పరిష్కారాలు ముందుకుసాగలేదు. కాబట్టి, కొంత వరకు ప్రమాదం ఉంది. చైనా నుంచి అమెరికా సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి ప్రభావం భారత్‌, జపాన్‌లపై ఎక్కువగా పడింది. భారత్ అనుకున్న స్థాయిలో కోలుకోలేకపోయింది. ఇది చైనాతో సరిపోలడానికి దశాబ్దాలు కూడా పట్టవచ్చు. జపాన్‌లో తక్కువ వనరులు ఉన్నాయి. అయినప్పటికీ అది వాటిని ఉత్తమంగా ఉపయోగించుకుంది.

Also Read: Parliament Attack 2001: పార్లమెంట్‌పై ఉగ్ర దాడికి 20 ఏళ్లు.. భద్రతా బలగాల తెగింపుతో తప్పిన భారీ ముప్పు..!

Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. పెరగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?