AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్యసభ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. బీజేపీ అభ్యర్థికి BJD మద్ధతు..!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ) మద్ధతు ప్రకటించింది. కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మరోసారి ఒడిశా నుంచి బీజేపీ అవకాశం కల్పించింది.

రాజ్యసభ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. బీజేపీ అభ్యర్థికి BJD మద్ధతు..!
Ashwini Vaishnaw
Janardhan Veluru
|

Updated on: Feb 14, 2024 | 12:06 PM

Share

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ) మద్ధతు ప్రకటించింది. కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మరోసారి ఒడిశా నుంచి బీజేపీ అవకాశం కల్పించింది. అశ్విని వైష్ణవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ బుధవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. రాజకీయాల్లోకి రాకముందు ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అశ్వని వైష్ణవ్ పనిచేశారు. 2019లో ఆయన తొలిసారి ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో కూడా బీజేడీ ఆయనకు మద్ధతిచ్చింది. ఇప్పుడు రెండోసారి కూడా అశ్వినీ వైష్ణవ్‌కి బీజేడీ మద్ధతు ప్రకటించడం విశేషం. పలు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మద్ధతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి బీజేడీ మద్ధతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఒడిశాలో ఖాళీ అయిన మొత్తం మూడు స్థానాల్లో రెండు స్థానాలకు తమ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులను బీజేడీ ఇప్పటికే ప్రకటించింది. మూడో సీటును బీజేపీకి విడిచిపెట్టగా.. ఈ సీటును అశ్విని వైష్ణవ్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్లు తెలిపింది. అలాగే ఉమేష్ నాథ్ మహారాజ్, మాయా నరోలియా, బన్సిలాల్ గుర్జార్‌లు కూడా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.

ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది.

గత వారం రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే 14 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్, సుధాంషు త్రివేదీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి