Ashwini Vaishnaw: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. ఎందుకో తెలుసా.?
కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశం అయ్యారు. గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమైన ఆయన.. ఇండియా స్టాక్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ల గురించి చర్చించినట్లు మంత్రి తెలిపారు..
కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశం అయ్యారు. గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమైన ఆయన.. ఇండియా స్టాక్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ల గురించి చర్చించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించి వైష్ణవ్ ట్విట్ చేశారు. తాను సుందర్ పిచాయ్‌ని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌లో కలిసినట్లు పేర్కొన్నారు.
గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమం కోసం సుందర్ పిచాయ్ గత ఏడాది భారత దేశంలో పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో సమావేశమయ్యారు. అయితే మోడీతో సమావేశం బాగానే జరిగిందని సుందర్ పిచాయ్ తెలిపారు. మోడీ నేతృత్వంలో టెక్నాలాజికల్ మార్పులు వేగంగా జరుగుతుండటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మన భాగస్వామ్యం మరింత బలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
Met @sundarpichai at the @Google HQ. Good discussion on India Stack and Make in India program. pic.twitter.com/Ul36NFA0CG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 9, 2023
అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసేందుకు జీ20 ప్రెసిడెన్సీకి భారత దేశానికి మద్దతిస్తామని తెలిపారు. ఈ సమావేశం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి