భారత్ విదేశాంగ విధానంలో కీలకంగా బౌద్ధమతం.. ప్రధాని మోదీ దార్శనికత చూశారా?
ప్రధానమంత్రి మోదీ ప్రపంచ సామరస్యం కోసం బౌద్ధమతం, దాని సాంస్కృతిక వారసత్వాన్ని ఆయుధంగా మలచుకున్నారు. అందుకు ఆయన దార్శనికతే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా బుద్ధమతంతో సంబంధాలున్న ఎన్నో దేశాలు పర్యటించి ఆయా దేశాల్లో భారత సంబంధాలు బలోపేతం చేయడానికి విశేష కృషి చేస్తున్నారు..

ప్రధానమంత్రి మోదీ థాయిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ థాయ్‌లోని వాట్ ఫో ఆలయాన్ని సందర్శించన్నారు. ఈ ఆలయాన్ని రిక్లైనింగ్ బుద్ధ ఆలయం అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీలంకలోని అనురాధపురలోని మహాబోధి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. బౌద్ధమతానికి ప్రపంచ కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడానికి, భారత విదేశాంగ విధానంలో బౌద్ధమతాన్ని కేంద్రంగా మార్చడానికి, ప్రపంచ సామరస్యం కోసం ప్రధాని మోదీ చేస్తున్న అత్యున్న ప్రయత్నాలకు ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది మోదీ దార్శనికతకు సాదృశ్యం. గతంలోనూ మోదీ ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
2024లో ఇండియా-ఆసియాన్ సమ్మిట్‌లో లావోస్ అధ్యక్షుడు థాంగ్‌లౌన్ సిసౌలిత్‌కు ప్రధాని మోదీ ఓ పాతకాలపు ఇత్తడి బుద్ధ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది ఉమ్మడి వారసత్వాన్ని, సాంస్కృతిక దౌత్య నిబద్ధతను సూచిస్తుంది. అదే ఏడాది బుద్ధుడు, ఆయన శిష్యులకు సంబంధించిన పలు పవిత్ర అవశేషాలను థాయిలాండ్‌కు భారత్ పంపించింది కూడా. బుద్ధుడి శిష్యులైన అరహంత్ సరిపుత్త, అరహంత్ మహా మొగ్గల్లనఅవశేషాలను భారత ప్రతినిధి బృందం బ్యాంకాక్‌కు తీసుకెళ్లింది. అలాగే థాయిలాండ్‌లోని 4 నగరాల్లో దాదాపు 25 రోజుల పాటు వీటిని ప్రదర్శించింది. 2023లోనూ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి మోదీ ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌లోని బాల్ బోధి వృక్షాన్ని సందర్శించారు. భారత్, జపాన్ మధ్య బౌద్ధ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కూడా ఓ ఉదాహరణే. అంతేకాకుండా మోదీ మొట్టమొదటిసారిగా భారత్‌లో గ్లోబల్ బౌద్ధ సమ్మిట్‌ను కూడా నిర్వహించి, పండితులు, అభ్యాసకులను ఒకచోట చేర్చారు. ఇందులో బౌద్ధ తత్వశాస్త్రం, బుద్ధుని బోధనలు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయని మోదీ దార్శనికతకు మరో నిదర్శనం.
2022లో మోదీ బుద్ధ పూర్ణిమ నాడు నేపాల్‌లోని లుంబిని సందర్శించి, బౌద్ధ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఇండో-నేపాల్ ఆధ్యాత్మిక సంబంధాలను బలోపేతం చేసేందుకు India International Centre for Buddhist Culture and Heritage అనే కీలక ప్రాజెక్ట్‌కు పునాది వేశారు. అదే ఏడాది మంగోలియన్ బుద్ధ పూర్ణిమ వేడుకల్లో భారత్‌లోని కపిలవస్తు అవశేషాలుగా పిలిచే బుద్ధుని నాలుగు పవిత్ర అవశేషాలను మంగోలియాకు పంపించి అక్కడ 11 రోజులపాటు ప్రదర్శించారు.
అలాగే 2019లో మంగోలియా అధ్యక్షుడు ఖల్త్‌మాగిన్ బటుల్గాతో కలిసి ఉలాన్‌బాతర్‌లోని చారిత్రాత్మక గండన్ టెగ్‌చెన్లింగ్ ఆశ్రమంలో బుద్ధుడు, ఆయన ఇద్దరు శిష్యుల విగ్రహాలను సంయుక్తంగా ఆవిష్కరించారు. 2018లో సింగపూర్‌లోని బుద్ధ టూత్ రెలిక్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఇది సింగపూర్ బౌద్ధ వారసత్వం పట్ల భారత్ తన మద్ధతు తెల్పి, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసింది. 2017లో ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన బౌద్ధ ప్రచారం ప్రధానంగా సాగింది. కొలంబోలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని, గంగారామయ బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఇది భారతదేశం-శ్రీలంక సాంస్కృతిక, మతపర బంధాలను బలోపేతం చేసింది. 2016లో వియత్నాం పర్యటనలో హనోయ్‌లోని క్వాన్ సు పగోడాను సందర్శించి, అక్కడి బౌద్ధ సన్యాసులతో సంభాషించారు. ఇది ఆగ్నేయాసియాలో బౌద్ధ దౌత్యానికి తోడ్పడింది.
2015లో మోదీ బహుళ దేశాలతో భారత్ బౌద్ధ సంబంధాలను బలోపేతం చేశారు. భారత్ – చైనా మధ్య చారిత్రక బౌద్ధ బంధాలను తెలియజేస్తూ చైనాలోని జియాన్‌లోని డా జింగ్‌షాన్ ఆలయం, బిగ్ వైల్డ్ గూస్ పగోడాను సందర్శించారు. మంగోలియాలో గండన్ ఆశ్రమాన్ని సందర్శించారు. 2014లో ప్రధాని మోదీ జపాన్‌లోని క్యోటోలో ఉన్న టోజి, కింకాకు-జి దేవాలయాలను సందర్శించి భారత్-జపాన్ బౌద్ధ సంబంధాలను బలోపేతం చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోదీ బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఎన్నో కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా బుద్ధుడి జీవితం, బోధనలతో ముడిపడిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి పర్యాటకానికి ఎంతో కృషి చేశారు. ఈ పవిత్ర ప్రదేశాలలో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు బౌద్ధ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్ (మహాపరినిర్వాన్ ఎక్స్‌ప్రెస్) సైతం ఏర్పాటు చేశారు. భారత్ – నేపాల్‌లోని బౌద్ధ ప్రదేశాలను సందర్శించడానికి ఈ ట్రైన్ అనుకూలంగా ఉంటుంది.
మరోవైపు కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీర్థయాత్ర గమ్యస్థానంగా మారింది. నలంద యూనివర్సిటీ పునరుద్ధరణ భారత్‌లో బుద్ధిజానికి ప్రపంచ కేంద్రంగా మారింది. బౌద్ధ సాహిత్య పరిరక్షణకు పాళి భాషను శాస్త్రీయ భాషగా మోదీ సర్కార్ గుర్తించింది. ఇవన్నీ బౌద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ మేరకు బౌద్ధ దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకోవడం ద్వారా బౌద్ధమతంలో ప్రతిపాదించబడిన శాంతి, జ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రపంచ కేంద్రంగా భారత్ పాత్రను బలోపేతం చేసేందుకు మోదీ సర్కార్ విశేష కృషి చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.