Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta plus variant: ఏపీ సహా డెల్టా ప్ల‌స్ కేసులు న‌మోదైన రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌.. యుద్ద‌ప్రాతిప‌దికన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం

ఏప్రిల్, మే నెలల్లో క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు

Delta plus variant: ఏపీ సహా డెల్టా ప్ల‌స్ కేసులు న‌మోదైన రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌.. యుద్ద‌ప్రాతిప‌దికన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశం
Delta Plus
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2021 | 9:46 PM

ఏప్రిల్, మే నెలల్లో క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మెల్లిమెల్లిగా ప‌రిస్థితులు నార్మ‌ల్ అవుతున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి. ఈ క్ర‌మంలో డెల్టా ప్లస్ వేరియంట్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుంది. కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్, కిందటి ఏడాది తొలిసారిగా ఇండియాలో కనిపించిన డెల్టా వేరియంట్ బంధువే. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్ర‌మంలో గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, పంజాబ్, జమ్ము-కాశ్మీర్, హరియాణా రాష్ట్రాలకు కేంద్రం లేఖ‌లు రాసింది. కేసులు గుర్తించిన ప్రాంతాల్లో కఠిన కంటైన్మెంట్ ఏర్పాట్లు, కాంటాక్ట్ ట్రేసింగ్ సహా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో గట్టి బంధం ఏర్పర్చుకునే లక్షణం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే ప్రమాదకర లక్షణాలు ఈ వేరియంట్‌కు ఉన్నాయ‌ని కేంద్రం హెచ్చరించింది. ఈ మేర‌కు జాతీయ హెల్త్ సెక్ర‌ట‌రీ రాజేష్ భూష‌ణ్ రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌కు లేఖ‌లు రాశారు. అయితే, డెల్టా ప్ల‌స్ వ‌ల్ల‌ థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని చెప్పడానికి తగినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ, వారాల తేడాతోనే పరిస్థితి మారిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త ప్ర‌భుత్వం ముంద‌స్థు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.

ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం తిరుపతిలో డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. డెల్టా ప్లస్ స్ట్రెయిన్ సోకిన వ్యక్తికి ట్రీట్మెంట్ అందించామని.. అతడి నుంచి ఈ వేరియంట్ ఇతరులెవరికీ వ్యాప్తి చెందలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ నిర్వహించిన భేటీలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని.. ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read: MAA elections 2021: ‘మా’ ఎన్నిక‌ల్లో ఎవ‌రి మ‌ద్ద‌తు ఎవ‌రివైపు.. ఓ లుక్కేద్దాం ప‌దండి

147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధుల పంపిణీ..! మిగిలిన రైతులు, కొత్తవారు ఇలా చేయండి..