Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు..!

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు..!
Chandrababu Delhi Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 18, 2024 | 7:09 AM

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీ విషయంలో ప్రత్యేక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను వచ్చే క్యాబినెట్‌లో ఆమోదించాలని ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి.

అలాగే ఏపీ రాజధాని అమరావతి పనుల కోసం బడ్జెట్‌లో సూచించిన నిధులను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాజెక్టులను చేపట్టేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్.. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు ముఖ్యమంత్రి. ఏపీ విషయంలో ప్రత్యేక సహాయంతో పాటు, వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.

తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా చర్చించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని అమిత్ షా ను కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్టు చంద్రబాబు కు స్పష్టం చేశారు అమిత్ షా. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోను ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ఆర్థిక సహాయం, వెనుకబడిన ప్రాంత గ్రాంటు నిధుల విడుదల, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక సహాయం కోరారు ముఖ్యమంత్రి. అలాగే కేంద్రమంత్రి కుమారస్వామిని కలిశారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కీలకంగా చర్చించారు. జలశక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్ తో సమావేశం లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలని కోరారు చంద్రబాబు.

చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలో పర్యటిస్తారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రులతో చర్చిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..