Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన ఆనంద్ మహింద్రా.. ఏమన్నారంటే ?

వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా పేరుపొందిన రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఇటీవల విద్యార్థుల వరస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనో.. లేక పరీక్షల్లో ఫెయిల్ అవుతామేననే భయంతో, ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం రోజు గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం కలకలం రేపింది.

Anand Mahindra: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన ఆనంద్ మహింద్రా.. ఏమన్నారంటే ?
Anand Mahindra
Follow us
Aravind B

|

Updated on: Aug 30, 2023 | 7:47 PM

వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా పేరుపొందిన రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఇటీవల విద్యార్థుల వరస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనో.. లేక పరీక్షల్లో ఫెయిల్ అవుతామేననే భయంతో, ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం రోజు గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ఈ ఏడాగి ఇప్పటిదాకా మొత్తం 24 మంది విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనల వల్ల అర్థాంతరంగా తమ చనువు చాలించి.. తల్లిదండ్రుల్ని శోక సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనందర్ మహింద్రా.. కోటాలో విద్యార్థుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

విద్యార్థులు గురవుతున్న ఒత్తిడిపై ఆయన ఆందోళ చెందారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో విద్యార్థుల మరణాల గురించి ఈ విధంగా రాసుకొచ్చారు. కోటాలో విద్యార్థుల వరస మరణాలు చూసి కలత చెందానని అన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యారులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. అయితే పంచుకోవడానికి తన వద్ద గొప్ప జ్ఞానం లేదని అన్నారు. కోటా విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ మీ అందరికి ఒకటి చెప్పాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ దశలో మీ లక్ష్యం.. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదని.. మిమ్మల్ని మీరు గుర్తించడమేనని అన్నారు. పరీక్షలల్లో విజయం పొందకపోవడం అనేది కేవం స్వీయ అన్వేషణలో భాగమని అన్నారు. అలాగే మీ నిజమైన ప్రతిభ మరెక్కడో ఉందని అర్థం అంటూ చెప్పారు. శోధిస్తూ.. ప్రయాణిస్తూ ఉండండి.. చివరికి ఎందులో ప్రతిభావంతులో మీరే గుర్తిస్తారు, అనుకున్నది సాధిస్తారని మహింద్ర రాసుకొచ్చారు. ప్రస్తతం ఈ ట్వీట్ వైరలవుతోంది. చాలామంది నెటీజన్లు దీనిపై స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా కోటాలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ ప్రవేశ పరీక్షల్లో కోచింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు అక్కడ దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎక్కువ నిరుపేద కుటంబాలకు చెందిన వారే. అయితే తల్లిదండ్రులకు భారం కాకూడదని.. లక్ష్యం చేరుకుంటామో లేదోనని ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2023లో ఇప్పటివరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.