AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన… అమిత్ షా రిపోర్ట్ ఏం చెబుతుంది ?

మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనపై హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో రిపోర్టును సమర్పించే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో.. నవంబరు 12న రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు దారి తీసిన పరిస్థితులను అమిత్ షా తన నివేదికలో వివరించవచ్చునని భావిస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీల మధ్య తలెత్తిన విభేదాల కారణంగానూ, ఏ పార్టీ కూడా తనకు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునేంత బలం ఉందని రుజువు చేయలేకపోవడంతోను రాష్ట్రపతి […]

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన...  అమిత్ షా రిపోర్ట్ ఏం చెబుతుంది ?
Anil kumar poka
| Edited By: |

Updated on: Nov 20, 2019 | 1:11 PM

Share

మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనపై హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో రిపోర్టును సమర్పించే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో.. నవంబరు 12న రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు దారి తీసిన పరిస్థితులను అమిత్ షా తన నివేదికలో వివరించవచ్చునని భావిస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీల మధ్య తలెత్తిన విభేదాల కారణంగానూ, ఏ పార్టీ కూడా తనకు అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునేంత బలం ఉందని రుజువు చేయలేకపోవడంతోను రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తున్నానని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్యాంగంలోని 356(1) అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించారు. అసెంబ్లీని సుషుప్తావస్థలో ఉంచారు. కాగా-ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతలు శివసేన నాయకులతో మరోసారి సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ ఈ నెల 18 న ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశమై మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించాలనుకున్నా.. అందుకు ఆమె అవకాశం ఇవ్వలేదు. కేవలం తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు తప్పితే.. ‘ అసలైన ‘ సమస్య మాత్రం పక్కదారి పట్టింది. ఆమెతో తాను మరోసారి భేటీ అవుతానని పవార్ పేర్కొన్నారు. మరోవైపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. డిసెంబరు మొదటివారంలో రాష్ట్రంలో తమ పార్టీ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని స్పష్టం చేశారు. శరద్ పవార్ వ్యాఖ్యలను బట్టి చూస్తే తమకు ‘ వంద బెర్తులు ‘ అవసరమని ఆయన సెటైర్ వేశారు. పవార్ ఆ విధంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Follow Us
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే