Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Ordinance Bill: ఢిల్లీకి రాష్ట్ర హోదాను.. నెహ్రూ, అంబేద్కర్‌లు వ్యతిరేకించారు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలని అన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్‌ వల్లాభాయ్‌, రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు సైతం ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు.

Delhi Ordinance Bill: ఢిల్లీకి రాష్ట్ర హోదాను.. నెహ్రూ, అంబేద్కర్‌లు వ్యతిరేకించారు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah
Follow us
Aravind B

|

Updated on: Aug 03, 2023 | 7:00 PM

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలని అన్నారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్‌ వల్లాభాయ్‌, రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు సైతం ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. మీ కూటమిలో ఉన్నారే కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతిని సపోర్ట్ చేయద్దని అన్ని పార్టీలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఏ కూటమి ఉన్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధిస్తారని పేర్కొన్నారు. 2015లో ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అక్కడ బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో అవినీతిని దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య అని అన్నారు.

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలు ఎవరి నియంత్రణలో ఉండాలనే విషయంపై గత కొన్నాల్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ పోరాటంపై కొద్ది నెలల క్రితమే ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఐఏఎస్ సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల వంటి వాటిపై పై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని చెప్పింది. ఈ తీర్పు తర్వాత పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని స్థానంలో రూపొందించిన బిల్లునే ప్రస్తుతం లోక్‌సభలో జరుగుతున్న వర్షకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైనా కూడా పార్లమెంట్‌కు చట్టం చేసే అధికారం ఉంటుందని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్టినెన్స్ వెల్లడిస్తోంది. అయితే ఢిల్లీకి సంబంధించి చట్టాలు రూపొదించడానికి రాజ్యాంగంలోని నిబంధనలు పర్మిషన్ ఇస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.