అప్రమత్తంగానే ఉన్నాం.. కొత్త రకం కరోనా వైరస్‌పై ఎలాంటి ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్‌పై సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా...
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్‌పై సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.యూకేలోని కొత్త రకం వైరస్‌పై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని భయపడవద్దన్నారు. ఇక్కడ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని అన్నారు. అవసరమైతే శాస్త్రవేత్తలు మాత్రం ఎప్పటికప్పుడు ఈ కొత్తరకం వైరస్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారని అన్నారు.
యూకేలో వెలుగు చూసిన ఈ కొత్తరకం వైరస్‌పై చర్చించడానికి సోమవారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బ్రిటన్ లో కనిపించిన ఈ కొత్త రకం కరోనా వైరస్ అంతకు ముందు వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంఓ లండన్‌తో పాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.