బాబాయ్.. మీరు చేస్తే కరెక్టు.. నేను చేస్తే కాదా?

మహారాష్ట్ర ప్రజలు సూపర్ సాటర్ డే ని ఎన్నటికీ మరచిపోలేరు. తెల్లారితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి మంతనాలు, వ్యూహాలతో సీన్ మార్చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. తెల్లవారుజామునే రాష్ట్రపతి పాలన ఎత్తివేయించి, రాజ్‌భవన్‌లో ఉదయం గం. 8.11 ని.లకు ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. అయితే.. 105 మంది సభ్యులున్న బిజెపికి అండగా నిలిచి సొంత బాబాయ్‌కు షాక్ (?) ఇచ్చిన అజిత్ పవార్ విశేషంగా వార్తలకెక్కారు. శుక్రవారం రాత్రి దాకా శరద్ […]

  • Updated On - 6:26 pm, Sat, 23 November 19 Edited By: Srinu Perla
బాబాయ్.. మీరు చేస్తే కరెక్టు.. నేను చేస్తే కాదా?

మహారాష్ట్ర ప్రజలు సూపర్ సాటర్ డే ని ఎన్నటికీ మరచిపోలేరు. తెల్లారితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి మంతనాలు, వ్యూహాలతో సీన్ మార్చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. తెల్లవారుజామునే రాష్ట్రపతి పాలన ఎత్తివేయించి, రాజ్‌భవన్‌లో ఉదయం గం. 8.11 ని.లకు ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. అయితే.. 105 మంది సభ్యులున్న బిజెపికి అండగా నిలిచి సొంత బాబాయ్‌కు షాక్ (?) ఇచ్చిన అజిత్ పవార్ విశేషంగా వార్తలకెక్కారు. శుక్రవారం రాత్రి దాకా శరద్ పవార్ వెంట నడిచిన ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ అర్ధరాత్రి మంతనాలలో బిజెపి వైపు మొగ్గు చూపారు.

అజిత్ పవార్ ఇలా చేస్తాడని ఊహించలేదని శరద్ పవార్ అంటుంటే.. కష్ట కాలంలో అండగా నిలిచిన తమకు ఇంతటి షాకిస్తారా అంటూ శరద్ పవార్ తనయ, అజిత్ పవార్ కజిన్ సిస్టర్ సుప్రియా సూలే ఉద్వేగంగా ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరికి కలిపి అజిత్ పవార్ వర్గం ఒక్కటే గుర్తు చేస్తుంది.

1978 నాటి రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తున్నారు అజిత్ వర్గం ఎమ్మెల్యేలు. 1978 ఎన్నికల తర్వాత అప్పటి సిట్టింగ్ సీఎం వసంత్ దాదా పాటిల్‌ను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే.. చివరి క్షణం దాకా వసంత్ దాదా పాటిల్ పక్కనే వున్న శరద్ పవార్ రాత్రికి రాత్రి పార్టీని చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి జనతాపార్టీ పంచన చేరి ప్రొగ్రెసివ్ ఫ్రంట్ పేరుతో గవర్నర్‌ని కలిసి ఆ మర్నాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శరద్ పవార్.

ఇప్పుడు శరద్ పవార్ అన్న కుమారుడు అయిన అజిత్ పవార్ కూడా ఆల్‌మోస్ట్ ఇదే తరహాలో వ్యవహరించారు. రాత్రి 8 గంటల వరకు శరద్ పవార్‌తో వున్న అజిత్ పవార్ ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపులోకి షిఫ్టు అయ్యారు. తెల్లవార్లూ జరిగిన పరిణామాలలో పొద్దున్నే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేశారు. ఒకప్పు తాను చేసిన పనినే ఇవాళ అజిత్ పవార్ చేస్తే… ఆయన్ని విమర్శించే నైతిక హక్కు శరద్ పవార్‌కు వుంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. దాంతో పాటు తాను ఒకప్పుడు చేసిన పనినే ఇప్పుడు అజిత్‌తో శరద్ పవరే చేయించారా అన్నది కూడా వినిపిస్తున్న అనుమానం.

ఏది ఏమైనా.. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్లు వ్యవహరించిన అజిత్ పవార్‌ను గట్టిగా విమర్శించలేని పరిస్థితి మరాఠా కురు వృద్ధ నేత శరద్ పవార్‌ది.