AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ ఛీ.. ఇదేం గలీజ్ పని.. ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకరమైన ఘటన!

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు అసహ్యకరమైన పని చేశాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయం గురించి ఎయిర్ ఇండియా డీజీసీఏకు తెలియజేసింది. దీనిపై పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు స్పందించారు. విమానయాన సంస్థతో మాట్లాడి, ఏదైనా తప్పు జరిగి ఉంటే, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఛీ ఛీ.. ఇదేం గలీజ్ పని.. ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకరమైన ఘటన!
Air India Flight
Balaraju Goud
|

Updated on: Apr 09, 2025 | 7:39 PM

Share

బుధవారం(ఏప్రిల్ 9) ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన గురించి ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు స్పందించారు. మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను పరిగణలోకి తీసుకుంటుందని, విమానయాన సంస్థతో మాట్లాడి, ఏదైనా తప్పు జరిగి ఉంటే, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సంఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 9న ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్లే విమానం (AI2336)లోని క్యాబిన్ సిబ్బందికి ప్రయాణీకుడు చేసిన పాడుపని గురించి సమాచారం అందించిందనితె తెలిపింది. నిబంధనలను అనుసరించి, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రయాణీకుడిని హెచ్చరించడమే కాకుండా, బాధితుడు బ్యాంకాక్‌లోని అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపింది. అయితే ఆ సమయంలో సిబ్బంది సహాయానికి తిరస్కరించినట్లు సమాచారం. కాగా, ఈ కేసులో నిందితులపై ఏదైనా చర్య అవసరమైతే, దాని కోసం ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ సందర్భాలలో ఎయిర్ ఇండియా DGCA సూచించిన SOP ని అనుసరిస్తుందన్నారు.

దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ సంఘటన 26 నవంబర్ 2022న జరిగింది. ఎయిర్ ఇండియా విమానం (AI-102) న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తోంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా మద్యం మత్తులో వృద్ధ మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత ఆ మహిళ ఎయిర్ ఇండియా, డిజిసిఎకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని తరువాత ఈ విషయం మరింత తీవ్రమైంది. ఆ తర్వాత జనవరి 2023లో శంకర్ మిశ్రాను అరెస్టు చేశారు. అంతేకాదు, ఈ కేసులో ఎయిర్ ఇండియా కూడా అపఖ్యాతి పాలైంది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. దీనిపై చర్య తీసుకుంటూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా విమానయాన సంస్థపై జరిమానా విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..