Air India Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. 163 మంది మృతదేహాలు గుర్తింపు
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం, దెబ్బతిన్నందున బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇప్పటివరకు 163 DNA నమూనాలను సరిపోల్చారు. 124 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాద ఘటనలో మరణించిన 163 మంది మృతదేహాలను అధికారులు గుర్తించడం జరిగింది. వీటిలో 124 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను త్వరలో అందజేస్తామని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకేఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం, దెబ్బతిన్నందున బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఇప్పటివరకు 163 DNA నమూనాలను సరిపోల్చారు. 124 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించారు.
అటు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. 71 మందిలో తొమ్మిది మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, ఇద్దరు చికిత్స సమయంలో మరణించారని డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. సివిల్ హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న బిజె మెడికల్ కాలేజీకి చెందిన మరో ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులు ప్రమాదంలో మరణించారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..