Air India: ఒకే రోజు ఏడు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. అందులో ఆర్ డ్రీమ్‌లైనర్‌లే.. ఎందుకో తెలుసా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా వియాన ప్రమాదంలో 270 మందికిపైగా ప్రయాణికులు మరణించిన ఘటన తర్వాత, మంగళవారం సాంకేతిక సమస్యలు, ఇతర కారణంగాలతో ఏకంగా 07 విమానాలను రద్దు అయ్యాయి. అయితే రద్దైన విమానాల్లో సుమారు 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానాలే ఉన్నాయి. ఈ నెల 12 అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైంది కూడా ఈ మోడల్‌కు చెందిన విమానమే.

జూన్ 12న 12 AI 171 విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్ ఇండియా తన విమానాలలో, ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా తనిఖీలను పెంచింది. ప్రయాణానికి ముందే విమానం మొత్తం క్షుణ్నంగా తనిఖీలు చేపట్టి ఎవైనా సాంకేతిక లోపాలు బయటపడితే వాటిని రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం, సాంకేతిక, ఇతర కారణాల కారణంగా ఏకంగా 07 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అయితే రద్దైన విమానాల్లో సుమారు 06 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ విమానాలే ఉన్నాయి. మంగళవారం రద్దు చేయబడిన వాటిలో ముందుగా, ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమానం రద్దు చేయడింది. ప్రయాణానికి ముందు విమానంలో తనిఖీలు చేస్తుండగా సాంకేతిక లోపం బయటపడడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత అహ్మదాబాద్ -లండన్ వెళ్లాల్సిన విమానం కూడా రద్దు అయ్యింది.
రద్దు చేయబడిన విమానాలలో ఇవి ఉన్నాయి:
- AI915 – ఢిల్లీ నుండి దుబాయ్ – B788 డ్రీమ్‌లైనర్
- AI153 – ఢిల్లీ నుండి వియన్నా – B788 డ్రీమ్‌లైనర్
- AI143 – ఢిల్లీ నుండి పారిస్ – B788 డ్రీమ్‌లైనర్
- AI159 – అహ్మదాబాద్ నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
- AI170 – లండన్ నుండి అమృత్‌సర్ – B788 డ్రీమ్‌లైనర్
- AI133 – బెంగళూరు నుండి లండన్ – B788 డ్రీమ్‌లైనర్
- AI179 – ముంబై నుండి శాన్ ఫ్రాన్సిస్కో – B777
అయితే ఈ విమానాలు రద్దు చేయడంపై ఎయిర్ ఇండియా యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఎయిర్ ఇండియా ఇలా రాసుకొచ్చింది. మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మేము వీలైనంత త్వరగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. వారి ఆశ్రయం కోసం మేము హోటల్ వసతిని అందిస్తున్నాము. అంతే కాకుండా ప్రయాణీకులు ఎంచుకుంటే రద్దు చేసిన టిక్కెట్లపై పూర్తి వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్‌ను కూడా అందిస్తున్నాము” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




