Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!

భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా మే 13, 2025న జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత ఈ విమానాశ్రయాలన్నీ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి.

ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
Air India
Follow us
Balaraju Goud

|

Updated on: May 13, 2025 | 8:04 AM

పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత విమానయాన సంస్థలు ప్రయాణీకులకు కీలక సూచనలు జారీ చేశాయి. భద్రతా కారణాల రీత్యా పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, ప్రయాణీకులు చెక్‌ ఇన్ కోసం మూడు గంటలు ముందుగానే ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని ఎయిర్ ఇండియా ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది.

భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో 75 నిముషాల ముందే చెక్ ఇన్ క్లోజ్‌ అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులు భద్రతా తనిఖీలు చెక్‌ ఇన్ ఫార్మాలిటీప్‌ పూర్తి చేసుకోవడానికి సమయానికి ముందే తమ తమ విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగోతో పాటు స్పైస్‌జెట్ విజ్ఞప్తి చేశాయి.

మే 13న జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. సోమవారం రాత్రి 11:38 గంటలకు సోషల్ మీడియా పోస్ట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ ఒక ప్రకటనలో, కొత్త పరిణామాల దృష్ట్యా, ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామన్నారు. జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే విమానాలను మే 13, 2025న రద్దు చేసినట్లు తెలిపింది.

తమ బృందం పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని ఎయిర్‌లైన్ తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన తర్వాత సోమవారం పౌర విమానాల కోసం తిరిగి తెరిచిన విమానాశ్రయాలలో ఈ ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. అమృత్‌సర్‌లో ముందుజాగ్రత్త బ్లాక్‌అవుట్ చర్యలు అమలు చేసిన తర్వాత సోమవారం సాయంత్రం అమృత్‌సర్‌కు వెళ్లే ఇండిగో విమానం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని వర్గాలు తెలిపాయి.

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత, పరిస్థితి మెరుగుపడింది. విమానాశ్రయం మరోసారి కార్యకలాపాలతో సందడిగా మారింది. అయినప్పటికీ జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు విమానాలు మే 13 నుండి తిరిగి ప్రారంభమవుతాయని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..