పిడుగుపాటుకు కూలిన తాజ్‌మహల్ పాలరాతి రైలింగ్ ‌..!

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. మరోవైపు పలుచోట్ల ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. తాజాగా యూపీలో పలుచోట్లు ఉరుములతో కూడిన భారీ వర్సాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆగ్రా ప్రాంతంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో తాజ్‌మహల్‌ యొక్క పాలరాతి రైలింగ్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని జంతువులు కూడా చనిపోయాయి. ఇక శుక్రవారం […]

పిడుగుపాటుకు కూలిన తాజ్‌మహల్ పాలరాతి రైలింగ్ ‌..!
Taj Mahal
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 11:27 AM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. మరోవైపు పలుచోట్ల ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. తాజాగా యూపీలో పలుచోట్లు ఉరుములతో కూడిన భారీ వర్సాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆగ్రా ప్రాంతంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో తాజ్‌మహల్‌ యొక్క పాలరాతి రైలింగ్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని జంతువులు కూడా చనిపోయాయి. ఇక శుక్రవారం కూడా భారీ వర్షానికి తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లోని చెట్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై సర్వే చేసి ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పిడుగుపాటుకు మృతిచెందిన ముగ్గురు వ్యక్తులకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ విషయాన్ని తాజ్‌మహల్ పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు.