India Corona: నిలకడగా కరోనా కేసులు.. మరోసారీ రెండు వేల లోపే.. కానీ అక్కడ మాత్రం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు వేలకు దిగువనే నమోదైన కేసులు(Corona Cases) నేడూ అదే విధంగా వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 6.9 లక్షల మందికి కరోనా నిర్ధారణ..

India Corona: నిలకడగా కరోనా కేసులు.. మరోసారీ రెండు వేల లోపే.. కానీ అక్కడ మాత్రం
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 25, 2022 | 10:45 AM

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రెండు వేలకు దిగువనే నమోదైన కేసులు(Corona Cases) నేడూ అదే విధంగా వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 6.9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,685 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు అధికారులు గుర్తించారు. కరోనా కారణంగా 83 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో రోజువారీ పాజిటివిటీ(Positivity Rate) రేటు 0.24 శాతానికి క్షీణించింది. యాక్టీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోతున్నాయి. నిన్న 2,499 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టీవ్ కేసులు 21,530కి తగ్గి, 0.05 శాతానికి చేరకున్నాయి. ఇప్పటివరకూ 4.30 కోట్ల కేసులు రాగా 4.24 కోట్ల మంది కోలుకున్నారు. మరోవైపు చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. చైనాలోని 13 నగరాలలో కఠిన ఆంక్షలు చేపడుతోంది. చైనా(China) దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్లో 3 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కొన్ని వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త ( Coronavirus ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, కొవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.

Also Read

RRR Movie: భ్రమరాంబ థియేటర్‌లో రాజమౌళి, చెర్రీల సహా ఫ్యామిలీల సందడి.. మూవీకోసం క్యూ కట్టిన సెలబ్రెటీలు

Helicopter stunts: నువ్వు మామూలోడివి కాదురోయ్‌..! హెలికాప్టర్‌తో స్టంట్సా.. సూపర్బ్‌ అంటున్న నెటిజనం..(వీడియో)

TSRTC: ప్రయాణికులపై ఆర్టీసీ మరో పిడుగు.. ఆ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ నుంచి అమలులోకి