Man Bird Friendship: హృదయాన్ని కదిలించే స్నేహం.. ఆకలి తీర్చిన వ్యక్తితో కొంగ స్నేహం.. వీడియో వైరల్
బరైపర్ మాలిక్ విలేజ్ నివాసి రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో కథ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది.

మనుషులు కొంచెం ప్రేమని చూపిస్తే.. పశుపక్షులు కూడా మంచి స్నేహితులు అవుతాయి. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిలిచాయి. ఇటీవల ఆరిఫ్ ఖాన్ గుర్జార్, సరస్ క్రేన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ పలువురు ఆకర్షించింది. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ మౌలోని మరో మనిషి పక్షి స్నేహం కథ వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ వార్త సంస్థ ANI ప్రకారం.. బరైపర్ మాలిక్ విలేజ్ నివాసి రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో కథ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారం ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది. అనంతరం రామ్ తో కలిసి జీవించడం ప్రారంభించింది. త్వరలోనే ఆ బంధం మరింత బలపడిందని రామ్ చెప్పాడు. రామ్ సరస్ క్రేన్‌తో ఆడుకుంటాడు. తన చేతులతో స్వయంగా ఆ కొంగకు తినిపిస్తాడు.




రామ్ కొంగకు ఆహారం ఇస్తున్న వీడియోను కూడా ANI షేర్ చేసింది. ”ఉత్తరప్రదేశ్‌లోని సారస్ క్రేన్ .. రామ్‌సముజ్ యాదవ్ మధ్య హృదయాన్ని కదిలించే స్నేహ బంధం” అనే క్యాప్షన్ ఇచ్చారు.
#WATCH | Heartwarming bonhomie between a Sarus crane and Mau’s Ramsamuj Yadav in Uttar Pradesh
I had found it on the farm where I had fed it once. After feeding it twice initially, it started to come to me repeatedly. It roams around freely in the village: Ramsamuj Yadav pic.twitter.com/W9Fw3Ozwdu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2023
వీడియోలో సరస్ .. రామ్ తో చాలా సరదాగా గడుపుతోంది. అతనితో సరదాగా నడుస్తోంది. అతని సమక్షంలో చాలా సౌకర్యంగా ఉంది.
అయితే వాస్తవంగా సరస్ క్రేన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఈ కొంగను ఇంట్లో పెంచుకోవడం చట్టవిరుద్ధం. అందుకనే కొంగకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన వెంటనే, అటవీ శాఖ అధికారులు గత నెలలో పక్షిని తీసుకువెళ్లారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద గుర్జర్‌పై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
