Chhattisgarh: ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్.. సర్పంచ్‎ నుంచి ముఖ్యమంత్రిగా పూర్తి ప్రస్థానం..

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఛత్తీస్‎గఢ్‎లో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చ నడిచింది. ఎట్టకేలకు ఈ చర్చకు తెరపడింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాయ్‎పూర్‎లోని పార్టీ ఆఫీసులో హాజరై శాశనసభాపక్ష నేతను ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఏకపక్షంగా సుర్గుజా ప్రాంతంలోని జష్‌పూర్‌ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణుదేవ్ సాయ్‎ పేరును తీర్మానించారు.

Chhattisgarh: ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్.. సర్పంచ్‎ నుంచి ముఖ్యమంత్రిగా పూర్తి ప్రస్థానం..
Adivasi Vishnudev Sai Elected Chief Minister Of Chhattisgarh Complete Political Reign
Follow us
Srikar T

|

Updated on: Dec 11, 2023 | 6:47 AM

మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఛత్తీస్‎గఢ్‎లో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చ నడిచింది. ఎట్టకేలకు ఈ చర్చకు తెరపడింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాయ్‎పూర్‎లోని పార్టీ ఆఫీసులో హాజరై శాశనసభాపక్ష నేతను ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఏకపక్షంగా సుర్గుజా ప్రాంతంలోని జష్‌పూర్‌ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణుదేవ్ సాయ్‎ పేరును తీర్మానించారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో బీజేపీ తన కాషాయజెండాను ఎగురవేసింది.

విష్ణుదేవ్ సాయ్ సీఎంగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు కృతజ్ఙతలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత గవర్నర్‎ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీ మేరకు హౌజింగ్ పథకంపై దృష్టి పెట్టారు.

సర్పంచ్‎గా మొదలై ముఖ్యమంత్రి దాకా..

ఛత్తీస్‎గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విష్ణుదేవ్ సాయ్ రాజకీయ ప్రయాణం సర్పంచ్‎గా ప్రారంభమైంది. ఈయన ఆదివాసీగా మంచి గుర్తింపు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‎గా గెలిచి‎ ఆ తరువాత అవిభాజ్య మధ్యప్రదేశ్‎లో తప్‎కారా శాశనసభ్యునిగా గెలిచారు. 1999, 2004, 2009లో రాయ్‎గఢ్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మొదటి సారి ప్రధాని అయిన తరువాత ఆయన కేబినెట్‎లో మంత్రిగా కొనసాగారు. అప్పుడు ఈయనకు ఉక్కు, గనుల శాఖను కేటాయించింది అధిష్టానం. అయితే ప్రస్తుతం ఛత్తీస్‎గఢ్ రాష్ట్రానికి తొలి ఆదివాసీ ముఖ్యమంత్రిగా నియమితులై సరికొత్త చరిత్రను లిఖించారు. ఈయనది పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా చెప్పాలి. తండ్రితో సహా ఇద్దరు పెద్దనాన్నలు మంత్రులుగా, ఎంపీలుగా కొనసాగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..