Actor Sunil: కేరళలో విపరీతమైన రద్దీ.. అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన నటుడు సునీల్
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు టాలీవుడ్ నటుడు సునీల్ అయ్యప్పను దర్శించుకున్నారు.
కేరళలో ఇసుకేస్తే రాలనంత మంది అయ్యప్ప భక్తులు కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రావటంతో భక్తుల సందడి కొనసాగుతుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో రావటంతో దర్శనానికి ఆలస్యం అవుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారులు శబరిమలకు చేరుకుంటున్నారు.
కేరళ అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా వస్తున్న క్రమంలో భక్తులు గంటల తరబడి లైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి..శబరిమలలో క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోతున్నాయి.. గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడిన ఉన్న భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగు నీరు లేకుండా తంటాలు పడుతున్నామని మండిపడ్డారు. ట్రావెన్‌కోర్ బోర్డుపై మండిపడిన భక్తులు త్వరగా దర్శనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు టాలీవుడ్ యాక్టర్ సునీల్ కూడా శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు..అయ్యప్ప మాలలో ఉన్న ఆయన ఇరుముడి కోసం అయ్యప్ప క్షేత్రానికి వెళ్లారు. ఆలయంలో ఇరుముడి పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలాధార ఉన్న సునీల్ ఇరుముడిని అయ్యప్పకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..