AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: కఠిన చట్టాలు వచ్చినా.. ఇంకా ఆగని ఉన్మాదం.. యువతిపై యాసిడ్ దాడి

Bengaluru: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షలు విధించినా స్త్రీలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ఎక్కడోచోట చిన్నారులనుంచి వృద్ధుల వరకూ అత్యాచారాలు..

Bengaluru: కఠిన చట్టాలు వచ్చినా.. ఇంకా ఆగని ఉన్మాదం.. యువతిపై యాసిడ్ దాడి
Bengaluru News
Surya Kala
|

Updated on: Apr 28, 2022 | 9:10 PM

Share

Bengaluru: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షలు విధించినా స్త్రీలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ఎక్కడోచోట చిన్నారులనుంచి వృద్ధుల వరకూ అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడులు వంటి వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ యువతిపై యాసిడ్(Acid attack)పోసిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో(Karnataka) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులో ఓ యువతిపై ఓ నిందితుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆసుపత్రి పాలైంది. బాధితురాలు గురువారం  9 గంటలకు పనికి వెళుతుండగా నిందితుడు యాసిడ్ దాడి చేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి.. బాధితురాలికి సహాయం చేసి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనకు  కారణం ప్రేమ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో దర్యాపు చేస్తున్నారు. నేరం చేసిన నిందుతుడు… బాధితురాలికి తెలిసిన వ్యక్తిని.. ఆ యువతి ఇంటి దగ్గర్లోనే ఉంటాడని పోలీసు అధికారి చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలో బాధితురాలిపై దాడి జరిగిన మెట్ల వద్ద యాసిడ్ మచ్చలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని..  ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు,

సాధారణంగా ఒక మహిళపై యాసిడ్ దాడులు జరగడానికి కారణం.. ఆమె ముఖం, శరీరాన్ని వికృతిగా మార్చాలనే ఉద్దేశ్యంతో చేస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు.  ఇందుకు యాసిడ్ లేదా ఇతర హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారని తెలుస్తోంది. మనదేశంలో ఇలా యాసిడ్ దాడులకు కారణం.. విఫలమైన ప్రేమ వ్యవహారాలు,  బాధితురాలి పట్ల ఏకపక్ష ఆకర్షణ, లేదా బాధితురాలి అవతలి వ్యక్తి ప్రేమను తిరస్కరించడం వంటివిగా ఉంటాయి.

డిసెంబర్ 2015 లో.. సుప్రీంకోర్టు యాసిడ్ అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ ఏటా 250-300 యాసిడ్ దాడులు నమోదవుతున్నాయి, అయితే చాలా కేసులు వెలుగులోకి రావడం లేదని.. వాస్తవానికి ఈ యాసిడ్ దాడుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.  2013లో యాసిడ్ దాడి విషయంపై ఓ నిర్దిష్ట చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Also Read: Solar Eclipse 2022: ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. కీలక వివరాలు మీకోసం..

మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
ఇప్పటికీ... ఒళ్ళు జలదరించేలా చేస్తున్న 19 ఏళ్ల నాటి ఆ మహావిషాదం..
ఇప్పటికీ... ఒళ్ళు జలదరించేలా చేస్తున్న 19 ఏళ్ల నాటి ఆ మహావిషాదం..