Solar Eclipse 2022: ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. కీలక వివరాలు మీకోసం..

Solar Eclipse 2022: ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుంది. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం తరువాత మరో దృశ్యం కూడా కనువిందు చేయనుంది.

Solar Eclipse 2022: ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. కీలక వివరాలు మీకోసం..
Solar Eclipse 2022
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2022 | 8:45 PM

Solar Eclipse 2022: ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుంది. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం తరువాత మరో దృశ్యం కూడా కనువిందు చేయనుంది. మొదటి సూర్యగ్రహణం నుండి 15 రోజుల తర్వాత.. అంటే సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. చంద్రగ్రహణం మే 16న జరుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఖగోళ సంఘటన సమయంలో ప్రజలు కొన్ని అంశాలను పాటించాలని చెబుతారు. వీటిని ఆచరించడం ద్వారా గ్రహణ సమయంలో ఏర్పడే దుష్ప్రభావాల నుంచి బయటపడొచ్చని పురాణాలు చెబుతున్నాయి.

కాగా, ఏప్రిల్ 30వ తేదీన పాక్షిక సూర్యగ్రహం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఇది ఉంటుంది. అయితే, భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ/పశ్చిమ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికాలో నివసిస్తున్న ప్రజలు ఈ దృశ్యాన్ని చూసే అవకాశం ఉందన్నారు.

సూర్యగ్రహణం అంటే ఏమిటి? భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహం ఏర్పడుతుంది. పరిశోధకుల సమాచారం ప్రకారం.. గ్రహణ సమయంలో సూర్యుని 54 శాతాన్ని మాత్రమే చంద్రుడు నిరోధిస్తాడు. ఇక నాసా(NASA) ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. నాసా యూట్యూబ్ ఛానెల్‌లో దీనిని వీక్షించొచ్చు.

వేదాలు, పురాణాల ప్రకారం సూర్యగ్రహణం రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సూర్యగ్రహణ సమయంలో ప్రజలు శివుడి మంత్రాన్ని జపించడం వలన మంచి జరుగుతుంది. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు తమ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లుకోవాలి. గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి.

సూర్యగ్రహణంసమయంలో చేయకూడనివి.. సూర్యగ్రహణం సమయంలో ప్రజలు ఆహారాన్ని వండడం, తినడం చేయొద్దని చెబుతున్నారు పండితులు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. సూర్యగ్రహణానికి ముందు ప్రజలు తులసి ఆకులను నీటిలో, ఆహారంలో వేయాలి. గ్రహణం సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Viral News: కొంపముంచిన కుక్క.. ఏకంగా లక్షా యాభై వేలు యామం.. అసలు ఏం జరిగిందంటే..?

Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు