AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP Vs BJP: నేతలందరినీ ఎన్‌కౌంటర్ చేస్తేనే.. ప్రధాని మోదీ ప్రశాంతంగా నిద్రపోతాడేమోః సంజయ్ సింగ్

AAP Vs BJP: ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

AAP Vs BJP: నేతలందరినీ ఎన్‌కౌంటర్ చేస్తేనే.. ప్రధాని మోదీ ప్రశాంతంగా నిద్రపోతాడేమోః సంజయ్ సింగ్
Sanjay Singh
Balaraju Goud
|

Updated on: Mar 11, 2023 | 4:16 PM

Share

కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తీహార్ జైలుకు మనీష్ సిసోడియాను తరలించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది. ఆప్ నేత సంజయ్ సింగ్ మట్లాడుతూ.. విపక్ష నేతలను వేధించడం దర్యాప్తు సంస్థలకు పనిగా మారిందని విమర్శించారు. ప్రశ్నించినవారిపై బీజేపీ పిచ్చెక్కినట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను చంపితేనే మోదీ శాంతియుతంగా జీవించగలరని ఆప్ నేత సంజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు.

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేస్తూ, “నాకు ఒక సూచన వచ్చింది. విపక్ష నేతలందరి ఎన్‌కౌంటర్‌ జరిగితే.. ప్రధాని మోదీ కనీసం 8 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోగలరు. ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం రెండూ ఉండవు. నియంతృత్వంతో ఉండొచ్చు.” అంటూ ట్వీట్ చేశారు.

వాస్తవానికి, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి సీబీఐ విచారణ చేపడుతోంది. ఇందుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ఈడీ విచారించి అరెస్ట్ చేసింది. ఆప్ నేత సిసోడియాను కోర్టు మార్చి 17 వరకు ఇడి రిమాండ్‌కు పంపింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ జరుపుతోంది.

ఇటీవల, మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ AAP, శరద్ పవార్ నేతృత్వంలోని NCP, మమతా బెనర్జీ సహా ఎనిమిది రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంయుక్త లేఖలు రాశాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఇదిలావుంటే ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టు ముందు కీలక అంశాలను ప్రస్తావించారు. సిసోడియా తన సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని, ఇది దర్యాప్తులో ముఖ్యమైన సాక్ష్యంగా పేర్కొన్నారు. లంచం, నేరాల ద్వారా సంపాదించిన రూ. 290 కోట్లకు పైగా వసూలు చేశారని తెలిపారు. ఢిల్లీలో తప్పు ఎక్సైజ్ పాలసీని రూపొందించడానికి సిసోడియా ఇతరులతో కలిసి కుట్ర చేశారని ED ఆరోపించింది. సిసోడియా కస్టడీ కోసం ED చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, అతని న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారు. ఇదంతా విధాన రూపకల్పన కార్యనిర్వాహకుల విధి అని, ఇది అనేక దశల గుండా వెళ్లాలని అన్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి ఆధారాలు నిరూపించలేకపోయిందన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్