ప్రేయసిని చంపి.. తప్పించుకుని పారిపోతుండగా మృత్యువుకు చిక్కి.. షాకింగ్ ఇన్సిడెంట్

మృత్యువు ఒకసారి పగ బట్టిందంటే.. తన పంతం తీర్చుకునే వరకు వదలంటే ఇదేనేమో.. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది. ఈ సారి అతను..

ప్రేయసిని చంపి.. తప్పించుకుని పారిపోతుండగా మృత్యువుకు చిక్కి.. షాకింగ్ ఇన్సిడెంట్
Road Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 30, 2022 | 11:18 AM

మృత్యువు ఒకసారి పగ బట్టిందంటే.. తన పంతం తీర్చుకునే వరకు వదలంటే ఇదేనేమో.. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది. ఈ సారి అతను ఓడిపోక తప్పలేదు. తప్పు చేస్తే దానికి ప్రతిఫలం కూడా వెంటనే కనిపించేస్తోంది. ఈ వాస్తవాలను ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తోంది. మాటా మాటా పెరిగి ప్రియురాలిని హత్య చేసిన ఓ యువకుడు.. పారిపోతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జిల్లాకు చెందిన కృష్ణయాదవ్‌.. నేహా అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లు వారి ప్రేమాయణం సజావుగానే సాగింది. ఆ సమయంలో వారిద్దరూ మాట్లాడుకునేందుకు బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ కిందకు వచ్చారు. సరదాగా మొదలైన వారి సంభాషణ మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన కృష్ణ యాదవ్.. యువతిపై తుపాకీ గురి పెట్టాడు. అంతటితో ఆగకుండా తలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

యువతి చనిపోవడంతో కృష్ణ భయాందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ముందూ వెనకా చూసుకోకుండా వెళ్లడంతో రోడ్డుపై వేగంగా వస్తున్న కారు.. బలంగా ఢీ కొట్టింది. అయినా అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని మళ్లీ పరుగందుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం అతను మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షిస్తుండగా ఆస్పత్రిలోనే కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..