AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stunts Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. కొంచెమైనా మారండ్రా.. వీడియో చూడాల్సిందే..

స్టంట్ చేయడం అంత తేలికైన పని కాదు. ఇందుకోసం చాలా కష్టపడాలి. స్టంట్స్ ను పర్ ఫెక్ట్ గా చేసేందుకు నెలల కొద్దీ సమయం పడుతుంది. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. సాధారణంగా మీరు సినిమాల్లో చాలా...

Stunts Video: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. కొంచెమైనా మారండ్రా.. వీడియో చూడాల్సిందే..
Bike Stunts
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 19, 2022 | 10:58 AM

స్టంట్ చేయడం అంత తేలికైన పని కాదు. ఇందుకోసం చాలా కష్టపడాలి. స్టంట్స్ ను పర్ ఫెక్ట్ గా చేసేందుకు నెలల కొద్దీ సమయం పడుతుంది. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. సాధారణంగా మీరు సినిమాల్లో చాలా స్టంట్‌లను చూసి ఉంటారు. ఇవి చూడటానికి సులభంగా అనిపించవచ్చు. కానీ వాటిని చేయడం చాలా కష్టం. విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా బైక్ పై కుర్రకారు చేసే స్టంట్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని తెలిసినా.. కొందరు మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వారే కాకుండా వారితో పాటు ప్రయాణిస్తున్న వారిని సైతం ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా తామూ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని తెలియక యాక్సిడెంట్స్ కు గురవుతున్నారు.

వీడియోలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై కూర్చుని వెళ్లడాన్ని చూడవచ్చు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మొదట సాధారణంగానే బైక్ నడిపినా.. వేగం పెరిగిన కొద్దీ స్టంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బైక్ సీటుపై రెండు కాళ్లు ఉంచాడు. ఆపై నెమ్మదిగా హ్యాండిల్‌ను వదిలేశాడు. భర్త చేసిన ఈ పనిని చూసి భార్య ఆశ్చర్యపోయింది. చిన్న పొరపాటు జరిగినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం ఆమెకు అర్థమైనట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. క్లిప్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం తప్పదని ఒకరు, ఆ మహిళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని మరొకరు కామెంట్లు రాశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి