AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Species: వేగంగా తగ్గిపోతున్న పక్షుల జాతులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ పర్యావరణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే ఈ సవాళ్లు పక్షుల మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 30 సంవత్సరాల్లో మన దేశంలో అధ్యయనం చేసిన 338 పక్షి జాతుల్లో 60 శాతం సంఖ్యాపరంగా తగ్గిపోవడం కలకలం రేపుతోంది. 13 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు దేశవ్యాప్తంగా 30,000 మంది పక్షి ప్రేమికులు అందించిన సమాచారాన్ని విశ్లేషించాయి.

Bird Species: వేగంగా తగ్గిపోతున్న పక్షుల జాతులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
Bird
Aravind B
|

Updated on: Aug 26, 2023 | 8:06 AM

Share

ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ పర్యావరణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే ఈ సవాళ్లు పక్షుల మనుగడపైనా తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 30 సంవత్సరాల్లో మన దేశంలో అధ్యయనం చేసిన 338 పక్షి జాతుల్లో 60 శాతం సంఖ్యాపరంగా తగ్గిపోవడం కలకలం రేపుతోంది. 13 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు దేశవ్యాప్తంగా 30,000 మంది పక్షి ప్రేమికులు అందించిన సమాచారాన్ని విశ్లేషించాయి. ఆ తర్వాత ఈ విషయాలను వెల్లడించాయి. మొత్తం 942 పక్షి జాతులను అధ్యయనం చేసిన వాటిలో 338 జాతులకు సంబంధించి దీర్ఘకాలిక ధోరణులను నిర్ధారించగలిగారు. అయితే వీటిలో 204 జాతుల సంఖ్య తగ్గిపోయింది. అలాగే 98 జాతులు స్థిరంగా ఉన్నాయి. మరో 36 జాతుల సంఖ్య పెరిగింది. మరో విషయం ఏంటంటే కొన్ని పక్షి జాతుల సంఖ్య పెరగడానికీ, మరికొన్నింటికి తగ్గడానికి మధ్య సంబంధం ఏదైనా ఉన్నదా అన్నది ఇంకా తేల్చలేకపోయామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

బట్టమేక పక్షి, తెల్ల పొట్ట హెరాన్‌, బెంగాల్‌ ఫ్లోరికాన్‌, ఫిన్స్‌ వీవర్‌ పక్షులు ప్రస్తుతం అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయనీ తెలిపారు. అలాగే వాటి రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయన కర్తలు హెచ్చరించారు. పచ్చిక బయళ్లు, చిత్తడి నేలలు, వనాలలో తిరిగే పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని తెలిపారు. అన్నిరకాల ఆహారాన్ని తినే పక్షులు, పండ్లు, పుష్ప మకరందాలను తినే పక్షుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కూడా వాటికన్నా మాంసాహారాన్ని, పురుగులనూ తినే పిట్టల సంఖ్య మరింత ఎక్కువగా అంతరించపోతోంది. వ్యవసాయంలో ఎరువులు, క్రిమినాశనుల వాడకం ఎక్కువ అవడం వల్ల పక్షుల ఉనికికి ప్రమాదం ఉందని తెస్తోందని ఐరోపా అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

భారత్‌లో జరిగినటువంటి తాజా అధ్యయనం కీలక విషయం వెల్లడించింది. విషతుల్య పదార్థాలను తినడం వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతోందని నిర్ధారించింది. అలాగే వలస పక్షుల సంఖ్య కూడా వేగంగా క్షీణిస్తోంది. పశ్చిమ కనుమలు, శ్రీలంక మధ్య వలస వెళ్లే పక్షుల విషయంలో ఈ తరుగుదల మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అడవులు అంతరించిపోవడం వల్ల ప్రస్తుతం అక్కడ జీవనం సాగిస్తున్న పక్షులకు ప్రాణాంతకరంగా మారింది. మరోవైపు చిత్తడి నేలలు తరిగిపోవడం వల్ల బాతుల ఉనికిని దెబ్బతీస్తోంది. అలాగే భారత్‌లో పట్టణ విస్తరణ, టేకు చెట్ల మాదిరిగా ఒకే తరహా వృక్ష వనాల పెంపకం, మౌలిక వసతుల విస్తరణ పక్షిజాతులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా కనిపించే పక్షులు చాలావరకు ఇప్పుడు తగ్గిపోవడంతో జంతు ప్రేమికులతో సహా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచైనా వాటి ఉనికి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.