Uttar Pradesh: వేదిక పైనే కుప్పకూలిన వధువు.. ఛాతీ నొప్పితో విలవిల.. ఆస్పత్రికి తరలించే లోపే..

|

Dec 04, 2022 | 10:42 AM

పెళ్లంటే రెండు కుటుంబాల వేడుక. ఇద్దరిని ఏకం చేసే అపురూప ఘట్టం. పెళ్లిలో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. వేదిక నుంచి భోజనాల వరకు అన్నీ ఘనంగా ఉంటాయి. పెళ్లయిన తరువాత బరాత్ తీయడం, రిసెప్షన్ చేయడం..

Uttar Pradesh: వేదిక పైనే కుప్పకూలిన వధువు.. ఛాతీ నొప్పితో విలవిల.. ఆస్పత్రికి తరలించే లోపే..
Marriage
Follow us on

పెళ్లంటే రెండు కుటుంబాల వేడుక. ఇద్దరిని ఏకం చేసే అపురూప ఘట్టం. పెళ్లిలో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. వేదిక నుంచి భోజనాల వరకు అన్నీ ఘనంగా ఉంటాయి. పెళ్లయిన తరువాత బరాత్ తీయడం, రిసెప్షన్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారాయి. ఈ పరిస్థితుల్లోనే నూతన వధువు ఉన్నట్టుంటి కుప్పుకూలి పడిపోవడం కలకలం సృష్టించింది. ఏమైందో తెలుసుకుని, ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మలిహాబాద్‌లో శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన తర్వాత పెళ్లి వేడుక శోకసంద్రంగా మారింది. భద్వానా గ్రామానికి చెందిన రాజ్‌పాల్ శర్మ కుమార్తె షిమగి శర్మ వివాహం శనివారం రాత్రి జరిగింది. 21 ఏళ్ల షిమాగికి బుద్ధేశ్వర్‌కు చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి జరిపించారు. ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. కళ్యాణోత్సవంలో అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

వరమాల వేయించేందుకు పెద్దవాళ్లు, పురోహితులు నూతన వధూవరులను వేదిక పైకి తీసుకువచ్చారు. ఇద్దరూ దండలు కూడా మార్చుకున్నారు. అదే సమయంలో వధువుకు ఆకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. ఉన్నఫళంగా కింద పడిపోయింది. కంగారు పడిన కుటుంబసభ్యులు ఆమెకు చికిత్స అందించేందుకు కస్మండిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఆమె మరణవార్తతో షిమాగి కుటుంబంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు కంటతడి పెట్టారు.

కాగా.. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. గుండెపోటు తో చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ముప్పై ఏళ్ల లోపు ఉన్న వారు కూడా ఈ మహమ్మారి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంతో ముంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..